Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: కాళీ మాత దీవించింది.. నారా లోకేష్ కాదు.. డోలో 650 లోకేష్.. కోల్...

Nara Lokesh: కాళీ మాత దీవించింది.. నారా లోకేష్ కాదు.. డోలో 650 లోకేష్.. కోల్ కతా లో ఇంత జరిగింది మరి

Nara Lokesh: కోల్ కతా కు నారా లోకేష్.. ఎందుకు వెళ్లారు.. దేనికోసం వెళ్లారు.. మొన్ననే కదా ఆయన రష్యా వెళ్ళింది.. అక్కడ అనేక సంస్థల ప్రతినిధులతో మాట్లాడింది.. పెట్టుబడులు పెట్టడానికి వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది.. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోలేదు. సప్త సముద్రాల అవతల ఉన్న వ్యవహారాన్ని చక్కబట్టారు. మరి ఇక్కడి హుగ్లీ నది సంగతి.. దానిమీద ఏర్పాటుచేసిన హౌరా బ్రిడ్జి సంగతి.. తేలుద్దామని కాళీ మాత సన్నిధికి వెళ్ళిపోయారు. కాళీమాత కోరిన కోరికలు.. […]

Nara Lokesh: కోల్ కతా కు నారా లోకేష్.. ఎందుకు వెళ్లారు.. దేనికోసం వెళ్లారు.. మొన్ననే కదా ఆయన రష్యా వెళ్ళింది.. అక్కడ అనేక సంస్థల ప్రతినిధులతో మాట్లాడింది.. పెట్టుబడులు పెట్టడానికి వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది.. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోలేదు. సప్త సముద్రాల అవతల ఉన్న వ్యవహారాన్ని చక్కబట్టారు. మరి ఇక్కడి హుగ్లీ నది సంగతి.. దానిమీద ఏర్పాటుచేసిన హౌరా బ్రిడ్జి సంగతి.. తేలుద్దామని కాళీ మాత సన్నిధికి వెళ్ళిపోయారు.

కాళీమాత కోరిన కోరికలు.. తీర్చే తల్లి.. తన భక్తులు జనాల మేలుకోరి అడిగితే కచ్చితంగా తీర్చుతుంది. అలానే తీర్చేసింది. నారా లోకేష్ కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. అంతేకాదు, బిడ్డా.. నువ్వు అడుగువేయ్.. అది దారి అయిపోతుంది అంటూ దీవించింది. ఏ ముహూర్తంలో అయితే కోల్ కతా లో అడుగుపెట్టారో నారా లోకేష్.. ప్రతి చర్చ విజయవంతమైంది.. ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మరొకసారి మార్చేసింది.

హిమాద్రి కెమికల్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ చౌదరితో లోకేష్ భేటీ అయ్యారు. రాయలసీమలోని చిత్తూరు.. కోస్తా ఆంధ్ర లోని నెల్లూరు ప్రాంతాలలో సిలికాన్ కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. అక్కడితోనే ఆగలేదు విశాఖపట్నంలో ప్రాంతీయ కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. స్పెషాలిటీ బ్లాక్ కార్బన్ ఉత్పత్తి యూనిట్ మొదలుపెట్టాలని సూచించారు. దానికి అనురాగ్ సానుకూలంగా స్పందించారు.. ఇక్కడితోనే లోకేష్ ఆగిపోలేదు అమరావతిలో తిరుపతి ఐఐటీ లేదా ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో మెటీరియల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు.

కేవలం అనురాగ్ మాత్రమే కాదు విక్రమ్ సోలార్ ఎండి జ్ఞానేశ్ చౌదరి, శ్యామ్ మెటాలిక్స్ ఎనర్జీ మెటాలిక్ డైరెక్టర్ శీతల్ అగర్వాల్, సూపర్ స్పెల్టర్ లిమిటెడ్ చీఫ్ గోపాలకృష్ణ చరణ్, రష్మీ మెటాలిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ సంజీవ్, ఐ టి సి చైర్మన్ సంజీవ్ పూరి వంటి వారి తో నారా లోకేష్ భేటీ అయ్యారు.. అంతేకాదు, పెట్టుబడులు పెట్టాలని కోరారు. అంతేకాదు పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చారు. గతంలో మాదిరిగా ఏపీలో ఇప్పుడు వాతావరణం లేదని.. సానుకూల దృక్పథం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని అని వ్యాఖ్యానించారు.

తాను డోలో 650 లాంటి వాడినని.. పెట్టుబడిదారులకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా సరే ఒక వాట్సాప్ చాట్ దూరంలోనే ఉంటానని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఏదైనా సమస్య ఎదురైతే స్వయంగా తాను రంగంలోకి దిగి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాళీమాత దీవించింది. పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. నారా లోకేష్ పర్యటన విజయవంతమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ అయింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఏపీ దూసుకుపోతోంది.. బాలయ్య బాబు డైలాగు లో బ్రేకులు లేని బుల్డోజరే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper