Homeఎంటర్టైన్మెంట్Senior Heroes Favorite Directors: సీనియర్ హీరోలకు ఈ తరం దర్శకులలో ఎవరంటే ఇష్టమో తెలుసా..?

Senior Heroes Favorite Directors: సీనియర్ హీరోలకు ఈ తరం దర్శకులలో ఎవరంటే ఇష్టమో తెలుసా..?

Senior Heroes Favorite Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళందరు అప్పటి నుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు… ఈ నలుగురు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా కొనసాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ […]

Senior Heroes Favorite Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళందరు అప్పటి నుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు… ఈ నలుగురు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా కొనసాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. ఈ సీనియర్ హీరోలకు ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో ఎవరంటే బాగా ఇష్టం అనే విషయం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో స్పందించారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి రాజమౌళి అంటే చాలా ఇష్టమని తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటిగా ముందుకు తీసుకుపోతున్నాడని ఈ తరం దర్శకులలోనే కాదు తర్వాత తరంలో కూడా రాజమౌళిని బీట్ చేసే దర్శకుడు ఎవరు లేరంటూ ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేశాడు… నటసింహం బాలయ్య బాబు సైతం ఈ జనరేషన్లో ఉన్న దర్శకులలో తనకు కూడా రాజమౌళి అంటేనే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. విక్టరీ వెంకటేష్ మాత్రం అనిల్ రావిపూడి అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు.

ఎందుకంటే అంతరించిపోతున్న కామెడీని తన సినిమాలతో మరోసారి తీసుకువచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని థియేటర్ కి రప్పించాడు. అందుకే అనిల్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు… నాగార్జున సైతం ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

ఎందుకంటే అతని సినిమాలో పెద్దగా కథ లేకపోయిన కూడా తన మేకింగ్ తో డైలాగులతో ప్రేక్షకుడిని స్టడీగా కూర్చోబెడతాడు. అలాగే యూత్ కి కావాల్సిన అంశాలు మొత్తం అతని సినిమాలో ఉంటాయి. కాబట్టి అతనంటే చాలా ఇష్టమని తెలియజేశాడు. అయితే ఈ హీరోలందరు వాళ్లకు ఇష్టమైన దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper