Homeఆంధ్రప్రదేశ్‌YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు. వారి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో నమోదవుతున్నవే అధికం. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ పై ఏకంగా సొంత కోడలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫ్యామిలీకి చిక్కులు తప్పేలా లేవు. మాజీ మంత్రి అప్పలరాజు కొడుకు మూలంగా ఇబ్బందులు తెచ్చుకున్నారు. […]

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు. వారి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో నమోదవుతున్నవే అధికం. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ పై ఏకంగా సొంత కోడలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫ్యామిలీకి చిక్కులు తప్పేలా లేవు. మాజీ మంత్రి అప్పలరాజు కొడుకు మూలంగా ఇబ్బందులు తెచ్చుకున్నారు. కొడుకు తో పాటు అరెస్టయ్యారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం అరెస్టయ్యే అవకాశం ఉంది. అది కూడా కుమారుడు మూలంగానే. ఎందుకంటే కుమారుడి పేరుతో.. ఆస్తి యజమాని బతికి ఉండగానే తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి.

సిదిరి అప్పలరాజు అలా..
కేవలం కుమారుల మూలంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు పోలీస్ కేసులకు చిక్కారు. అరెస్టులు సైతం నడుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు అనేవి సహజం. అలానే రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యారు మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు. అయితే కుమారుడ్ని కేసు నుంచి తప్పించేందుకు మరొకరిని బలిపశువు చేశారు అప్పలరాజు. అలా కుమారుడ్ని బయటపడేసే క్రమంలో ఇద్దరు దొరికిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకే జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే పెద్దమనిషి పాత్ర పోషించి సమస్య పరిష్కరించుకుంటే బాగుండేది. కానీ దానిని రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు.

తమ్మినేని ఇలా..
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం అలానే తన కుమారుడు మూలంగా కేసుకు గురయ్యారు. తన కుమారుడికి అడ్డగోలుగా నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు.. ఏకంగా బతికున్న యజమానిని చనిపోయినట్టు చూపించి.. వారి వారసుల పేరుతో తప్పుడు ధృవీకరణ పత్రాలు రూపొందించి.. కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు, ఒక పెద్ద మనిషిగా చలామణిలో ఉన్నప్పుడు ఇటువంటి అడ్డగోలు వ్యవహారానికి తెర తీశారు. ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఫ్యామిలీతో పాటు పరారీ అయ్యారు.

ఇప్పుడు జోగి రమేష్ వంతు..
ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఈయన కూడా కుమారుడి వల్ల కేసుల్లో చిక్కుకున్నారు. ఆయన ఒక్కరే కాదు ఫ్యామిలీ మొత్తం 11 మందిపై ఇప్పుడు సొంత కోడలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. వరకట్నం తో పాటు గృహహింస పాల్పడుతున్నారంటూ సొంత కోడలు ఫిర్యాదు చేయడం మాత్రం సంచలనంగా మారింది. ఏడాది కిందట కుమారుడికి వివాహం జరిగింది. ఇంతలోనే ఈ వివాదం తలెత్తింది. పరిష్కరించాల్సిన పెద్దమనిషి పాత్రలో ఉండగా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితికి వచ్చింది. ఇది కూడా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు జోగి రమేష్. ఇలా వైసిపి నేతలకు కుమారుల వల్ల తలవొంపులు వస్తుండడం మాత్రం నిజంగా ఆందోళన కలిగించే విషయమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper