N Chandrasekaran: టాటా కంపెనీలో రతన్ టాటా తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు చంద్ర శేఖరన్. టాటా సన్స్ కంపెనీకి ఆయన దాదాపుగా దశాబ్దానికి మించి చైర్మన్ గా కొనసాగుతున్నారు. టాటా కంపెనీ వినూత్నమైన వ్యాపారాలలో అడుగుపెట్టడానికి చంద్రశేఖరన్ ప్రధాన కారణం. ఆయన ఆధ్వర్యంలోనే టాటా కంపెనీ ఎఫ్ఎం సీజీ రంగంలోకి అడుగు పెట్టింది. అద్భుతమైన ఫలితాలను చవిచూస్తోంది.
టాటా కంపెనీ తో దశాబ్దానికి మించి అనుబంధం ఉన్న చంద్రశేఖరన్.. ఆ బంధానికి వీడ్కోలు పలికారు. ఇకపై ఆ కంపెనీలో కొనసాగేది లేదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఏకంగా ఆ కంపెనీకి రాజీనామా కూడా చేశారు. టాటా అధినేత.. దివంగత రతన్ టాటా తో చంద్రశేఖరన్ కు అవినాభావ సంబంధం ఉంది. వీరిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినప్పటికీ.. అదే స్థాయిలో తమ మధ్య బంధాన్ని కొనసాగించేవారు. చంద్రశేఖరన్ కు వ్యాపారంలో కొత్త కొత్త పద్ధతుల గురించి అపారమైన పట్టు ఉండేది. ఆ విషయాలను రతన్ టాటా తో పంచుకునేవారు. తద్వారా వ్యాపారంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టేవారు. అందువల్లే టాటా కంపెనీ ఈ స్థాయిలో లాభాలు సాధించడం మొదలుపెట్టింది. ఆటోమొబైల్ నుంచి టెక్నాలజీ వరకు ఇలా ప్రతి రంగంలోనూ టాటా కంపెనీ అద్భుతమైన ఫలితాలను దక్కించుకుంది. దినంతటికీ ప్రధాన కారణం చంద్రశేఖరన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దాదాపు దశాబ్దానికి మించి టాటా సన్స్ కంపెనీకి చైర్మన్ గా కొనసాగుతున్నారు చంద్ర శేఖరన్. ఇంతటి అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ టాటా కంపెనీ నుంచి ఆయన బయటికి వచ్చేసారు. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా తో విభేదాలు ఎందుకు ప్రధాన కారణం అని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో టాటా కంపెనీ వార్షిక సమావేశం జరిగింది. చంద్ర శేఖరన్ పదవి కాలం పొడగింపును టాటా ట్రస్ట్ బోర్డు మెంబర్లు వ్యతిరేకించారు. అంతేకాదు టాటా సన్స్ ను స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలని చంద్రశేఖరన్ బలంగా నిర్ణయించుకున్నారు. తద్వారా కంపెనీ విస్తరణ మరింత మెరుగ్గా ఉంటుందని ఆయన అంచనా వేశారు. అయితే ఆయన ఆలోచనకు నోయల్ అడ్డుకట్ట వేశారు. స్టాక్స్ లోకి టాటా సన్స్ ను తీసుకురావద్దని అని చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఇకపై ఈ కంపెనీలో కొనసాగాల్సిన అవసరం తనకు లేదని చంద్రశేఖరన్ బలంగా నిర్ణయించుకున్నారు. అందువల్లే తన పదవికి రాజీనామా చేశారు.
టాటా కంపెనీ ఉన్నతిలో.. టాటా కంపెనీ విస్తరణలో చంద్రశేఖరన్ అపారమైన కృషి చేశారు. ముఖ్యంగా టిసిఎస్ విషయంలో చంద్రశేఖరన్ ముందుచూపు ఆ కంపెనీని దిగ్గజ సంస్థగా నిలబెట్టింది. వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టింది. ఇంత చేసినప్పటికీ విభేదాల వల్ల చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. టాటా కంపెనీకి చైర్మన్గా కొనసాగిన ఆయన.. ఇకపై మాజీ ఉద్యోగిగా మిగిలిపోయారు. చంద్రశేఖరన్ తీసుకున్న నిర్ణయం వ్యాపార వర్గాలలో సంచలనంగా మారింది.