Swadeshi MRI Machine: నేటి ఆధునిక కాలంలో మందులకు లొంగని వ్యాధులు మనుషులకు వస్తున్నాయి. వైద్యులు కూడా అంచనా వేయలేని విధంగా రోగాలు పెరిగిపోతున్నాయి. చివరికి మనిషి ప్రాణాలను హరించేస్తున్నాయి.
దీర్ఘకాలిక రోగాలను ముందస్తుగా అంచనా వేయాలంటే కచ్చితంగా ఎమ్మారై తీయాల్సిందే. ఇది పూర్తిగా శరీరంలోని అత్యంత సూక్ష్మమైన మార్పులు కూడా పరిశీలించగలుగుతుంది. దానిని వెంటనే చెప్పగలుగుతుంది. తద్వారా రోగి శరీరంలో చోటుచేసుకుంటున్న మార్పులను అంచనా వేసి.. వాటి నివారణకు తగ్గట్టుగా మందులు రాయడం ద్వారా.. రోగాలను ముందుగానే నయం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఎమ్మారై అనేది అత్యాధునికమైన యంత్రం. దీనిని ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనికి సంబంధించిన టెక్నాలజీ మన దగ్గర లేదు. అయితే మనదేశంలో వోక్సేల్ గ్రిడ్స్ అనే కంపెనీ మనదేశంలో మొట్టమొదటి ఎంఆర్ఐ మిషన్ ను తయారుచేసింది. వోక్సెల్ గ్రిడ్స్ అనేది బెంగళూరు నగరానికి చెందిన ఒక అంకుర సంస్థ. ఈ కంపెనీ చేసిన ఎంఆర్ఐ యంత్రం ద్వారా స్కాన్ ఖర్చు 70%.. యంత్రం వ్యయం 40% వరకు తగ్గుతుంది. ఈ కంపెనీ ఇంత గొప్ప ఆవిష్కరణ చేసినప్పటికీ నిధుల కొరత వల్ల ఇబ్బంది ఈ నేపథ్యంలో ఈ కంపెనీ పై మల్టీ నేషనల్ కంపెనీ కన్ను వేసింది. దానిని దక్కించుకోవాలని చూసింది.
ఈ నేపథ్యంలో టాటా ట్రస్ట్స్, జోహో అనే కంపెనీలు వోక్సేల్ గ్రిడ్స్ కంపెనీకి సహాయం చేశాయి. ఆర్థికంగా ఆదుకున్నాయి. తద్వారా ఆ కంపెనీ తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ యంత్రాలను తయారు చేయడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే ఆర్డర్లు భారీగా వస్తున్నాయని ఆ కంపెనీ చెబుతోంది. దేశంలోని పేరుపొందిన కార్పొరేట్ హాస్పిటల్స్.. మధ్యతరగతి హాస్పిటల్స్.. ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ కంపెనీ ఎంఆర్ఐ యంత్రాలను అందజేస్తుంది. అయితే టాటా ట్రస్ట్స్, జోహో కంపెనీలు మానవతా దృక్పథంతో చేసిన సహాయం వల్ల వోక్సల్ గ్రిడ్స్ కంపెనీకి ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. అందువల్లే ఆ కంపెనీ విరివిగా ఎంఆర్ఐ యంత్రాలను తయారు చేస్తోంది. ” మా ఆవిష్కరణ గొప్పదైనప్పటికీ.. ఆర్థిక కష్టాలు ఇబ్బంది పెట్టాయి. అటువంటి సమయాల్లో మన దేశానికి సంబంధించిన టాటా.. జోహో కంపెనీలు ఆర్థికంగా ఆదుకున్నాయి . మా ఆర్థిక కష్టాలు చూసి ఓ కంపెనీ మమ్మల్ని కొనేయాలని చూసింది. కానీ భగవంతుడి స్క్రిప్ట్ వేరే విధంగా ఉందని”వోక్సల్ గ్రిడ్స్ కంపెనీ సీఈవో అరుణాచలం పేర్కొన్నారు.