Ratan Tata : ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ.. ఇంతటి పాడు దినాల్లోనూ కొంతమంది సార్ధక నామదేయులుగా మిగిలిపోతున్నారు.. సజీవంగా లేకపోయినప్పటికీ.. తమ సేవ నిరతి ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారు.. ఉన్నంతకాలం పేద ప్రజలకు సేవ చేసి.. కాలం చేసినప్పటికీ తమను నమ్ముకున్న వారి సేవలో తరించి చరితార్థులుగా మిగిలిపోతున్నారు. ఈ జాబితాలో రతన్ టాటా (Ratan Tata) కు అగ్ర తాంబూలం ఇవ్వచ్చు. ఎందుకంటే బతికి ఉన్నన్ని రోజులు వీధి కుక్కల నుంచి మొదలు పెడితే ఉద్యోగుల వరకు రతన్ టాటా సహాయం చేశారు. కరోనా వంటి పీడ దినాల్లోనూ తనవంతుగా సహాయం చేశారు. ప్రధానమంత్రి కేర్ ఫండ్స్ కు భారీగా విరాళం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇటీవల కన్నుమూశారు. రతన్ టాటా చనిపోయినప్పటికీ.. తనను నమ్ముకున్న వారికి ఏమాత్రం అన్యాయం చేయలేదు. తన వీలునామాలో.. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రయోజనం అందేలాగా చూశారు.
Also Read : 3,800 కోట్లు.. రతన్ టాటా దాతృత్వానికి ఇదో ఉదాహరణ మాత్రమే..
రతన్ టాటా రాసిన వీలునామాకు జాతీయ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. వాటి ప్రకారం రతన్ టాటా ఎవరెవరికి ఎంత కేటాయించారు అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే.. రతన్ టాటా కు రజన్ షా అనే వ్యక్తి ఎప్పటినుంచో వండి పెడుతున్నాడు. రతన్ టాటాకు ఆయన వ్యక్తిగత కుక్ గా ఉన్నారు.. రతన్ టాటా తినే ప్రతి వంటకాన్ని రజన్ షా మాత్రమే వండేవారు. రజన్ వండిన వంటలు మాత్రమే రతన్ తినేవారు. ఒకవేళ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పటికీ రతన్ రజన్ ను వెంట తీసుకెళ్లేవారు. పొరపాటున కూడా హోటల్స్ లో విదేశీ వంటకాలను రతన్ రుచి చూసేవారు కాదు. రతన్ కన్నుమూసినప్పటికీ తనకు వండిపెట్టిన రజన్ కు ఆర్థిక ప్రయోజనం దక్కేలా వీలునామాలో కోటి రూపాయలు ఇవ్వాలని రాశారు. రతన్ జీవించి ఉన్నప్పుడు ఇంటి పనులు చేసిన సుబ్బయ్యకు 66 లక్షలు కేటాయిస్తూ వీలు నామాలో రాశారు. కార్యదర్శి డెల్నాజ్ కు పది లక్షల కేటాయించారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సంతను నాయుడు కు ఉన్న కోటి రూపాయల రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు. ఇంటి పొరుగున ఉన్న వారి అప్పు కూడా రతన్ టాటా మాఫీ చేశారు. రతన్ టాటా కు మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రతన్ టాటా కు మొత్తం పదివేల కోట్ల ఆస్తులు ఉండగా.. అందులో 3800 కోట్ల రూపాయలను దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించారు.. వంట మనిషికి రతన్ టాటా కోటి కేటాయించడం పట్ల సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది..” కేజిఎఫ్ సినిమాలో తనను నమ్ముకున్న వారికి కొత్త ప్రాంతాన్ని సృష్టిస్తాడు రాఖీ. వారికోసం భవంతులు నిర్మిస్తాడు. వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అది సినిమా.. నిజ జీవితంలో మాత్రం దానిని నిజం చేసి చూపించాడు రతన్ టాటా. అందువల్లే అతడిని దేశం యావత్తు దేవుడిగా కీర్తిస్తోందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read : లక్షల ఉద్యోగాలకు ప్రకటన.. రతన్ టాటాకు నివాళిగా కొలువుల జాతర.