Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: ఆ పాయింట్ తో విజయసాయిరెడ్డి భారీ స్కెచ్!

Vijayasai Reddy: ఆ పాయింట్ తో విజయసాయిరెడ్డి భారీ స్కెచ్!

Vijayasai Reddy: వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. ఏడాది కిందట ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇకనుంచి రాజకీయాలు చేయనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ సరిగ్గా ఏడాది తిరగకముందే తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. కానీ ఆయనను ఏ పార్టీ చేర్చుకోవడం లేదు. గత పరిస్థితుల దృష్ట్యా కూటమి పార్టీల్లో చేరలేరు. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేరు. బిజెపిలోకి వెళ్తామంటే […]

Vijayasai Reddy: వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. ఏడాది కిందట ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇకనుంచి రాజకీయాలు చేయనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ సరిగ్గా ఏడాది తిరగకముందే తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. కానీ ఆయనను ఏ పార్టీ చేర్చుకోవడం లేదు. గత పరిస్థితుల దృష్ట్యా కూటమి పార్టీల్లో చేరలేరు. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేరు. బిజెపిలోకి వెళ్తామంటే టిడిపి అడ్డుపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తారని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులైన రెడ్డి సామాజిక వర్గం నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన రెడ్డి సామాజిక వర్గ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశం మీద, భారత సంస్కృతి మీద కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతోంది. మన దేశం, ప్రజల సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం పై ఉంది. విదేశీయుల పాలన పోయిన మన సంస్కృతి మీద దాడులు మాత్రం ఆగడం లేదు. దేశంలో అంతర్గత కలహాలు సృష్టిస్తున్న శక్తుల పట్ల రెడ్డి సామాజిక వర్గం అప్రమత్తంగా ఉండాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మతమార్పిడులు కొనసాగితే హిందూ ధర్మం అంతరించిపోతుంది”.. అంటూ వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.

అయితే రెడ్డి సామాజిక వర్గం విషయంలో విజయసాయిరెడ్డి ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. ఇప్పుడు మొత్తం మార్పిడులు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా సరికొత్త సంకేతాలు పంపించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. హిందూ మతానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని విమర్శలు కూడా ఉన్నాయి. ఒకవైపు టీటీడీ లడ్డూ వివాదం కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు దారుగా రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఇప్పుడు మతమార్పిడులు, హిందూ ధర్మ రక్షణ వంటి అంశాల పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యానాలు చూస్తుంటే ఏదో భారీ వ్యూహం ఉన్నట్టు అర్థమవుతోంది. కచ్చితంగా అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని తెలిసిపోతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper