Sreeleela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే అదృష్టం అందరికీ రాదు. చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. ఆ తక్కువమందిలో శ్రీలీల(SreeLeela) కూడా ఒకరు. ‘పెళ్లి సందడి’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, తొలిసినిమా తోనే ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడినప్పటికీ, శ్రీలీల టాలెంట్ ని చూసి నిర్మాతలు ఆమెకు అడ్వాన్స్ చెక్కులతో క్యూలు కట్టారు. అలా వరుసగా వచ్చిన ప్రతీ ఆఫర్ ని అంగీకరించడం వల్లే శ్రీలీల కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అందాయి. ఆమె కెరీర్ ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ తప్ప మరో బ్లాక్ బస్టర్ చిత్రం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆమె రేంజ్ లో సమయం వృధా చేసింది అనేది.
కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లోనూ ఈమె ఈమధ్య కాలం లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇన్ని ఫ్లాప్స్ పడిన తర్వాత కెరీర్ పై ప్రభావం లేకుండా అయితే ఉండదు. అందుకే మెయిన్ హీరోయిన్ రోల్ నుండి సెకండ్ హీరోయిన్ రోల్ పోషించే స్థాయికి పడిపోయింది శ్రీలీల. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘ధనుష్’ 55 వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే జరిగింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే సాయి పల్లవి పేరు ని ప్రకటించేశారు మేకర్స్. ఇప్పుడు అందులో శ్రీలీల కూడా భాగం కాబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు.
ఇందులో ఆమెది మెయిన్ హీరోయిన్ మాత్రం కాదట. కానీ వీళ్లిద్దరు ఒకే సినిమాలో ఉండడం మాత్రం ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సాయి పల్లవి అద్భుతమైన డ్యాన్సర్. ఆమె డ్యాన్స్ ని చూడడం కోసమే థియేటర్స్ కి కదిలే ప్రేక్షకులు లక్షల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదేమో. అదే విధంగా శ్రీలీల కూడా అద్భుతమైన డ్యాన్సర్. నటన లో ఈమె సాయి పల్లవి రేంజ్ కాకపోయినా, డ్యాన్స్ విషయానికి వస్తే సాయి పల్లవి కి భారీ పోటీ ఇవ్వగలదు. ఆమెని డామినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇద్దరు అద్భుతమైన డ్యాన్సర్లు ఉన్నప్పుడు కచ్చితంగా డైరెక్టర్ వాళ్ళని వాడుకుంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆడియన్స్ కి ఆ సందర్భం వచ్చినప్పుడు థియేటర్స్ లో విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించబోతున్నాడు.