Homeఆంధ్రప్రదేశ్‌Vidadala Rajini: పల్నాడులో నవ్వుల పాలు.. పాపం విడదల రజిని

Vidadala Rajini: పల్నాడులో నవ్వుల పాలు.. పాపం విడదల రజిని

Vidadala Rajini: పల్నాడు రాజకీయాలలో 2019 నుంచి 2024 వరకు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి విడదల రజిని చక్రం తిప్పారు. తన మరిది.. ఇంకా కొంతమంది నాయకులతో కలిసి తిరుగులేని స్థాయిని చూపించారు. అయితే అది కొంతకాలం మాత్రమే. వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత రజనికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు.. అరాచకాలు బయటికి వచ్చాయి. కొంతమంది రైతుల […]

Vidadala Rajini: పల్నాడు రాజకీయాలలో 2019 నుంచి 2024 వరకు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి విడదల రజిని చక్రం తిప్పారు. తన మరిది.. ఇంకా కొంతమంది నాయకులతో కలిసి తిరుగులేని స్థాయిని చూపించారు. అయితే అది కొంతకాలం మాత్రమే. వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత రజనికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు.. అరాచకాలు బయటికి వచ్చాయి. కొంతమంది రైతుల దగ్గర ఆమె తీసుకున్న లంచాల తాలూకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. గతంలో ఆమె చిలకలూరిపేటకు ప్రాతినిధ్య వహించారు. 2024 ఎన్నికల్లో జగన్ సూచనల మేరకు వేరే స్థానంలోకి వెళ్లారు. అక్కడ ఓటమి ఎదురు కావడంతో మళ్లీ పాత స్థానానికి వచ్చారు.

ఇటీవల చిలకలూరిపేటలో ఆమె ఒక ఎస్సై నెట్టివేస్తే కింద పడిపోయారు. దానిని సింపతి కార్డు లాగా ఉపయోగించుకున్నారు. ఏడుపు రాజకీయాలు మొదలుపెట్టారు. కానీ అవేవి ఆమెకు ప్లస్ పాయింట్లు కాలేకపోయాయి. పైగా ఆమె చేస్తున్న రాజకీయాలు నవ్వుల పాలయ్యాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. నామినేషన్లు దాఖలు చేస్తున్న సందర్భంలో.. పోలీసులు తనని కింద పడేశారని.. అడ్డుకున్నారని ఒక రసవత్తరమైన డ్రామాకు రజిని తెరలేరు. ఇంట్లో కూర్చుని పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. సానుభూతిని పొందడానికి వైసీపీకి సంబంధించిన కీలక నాయకులను తన వద్దకు పిలిపించుకుంటున్నారు. సాక్షి టీవీలో లైవ్ కవరేజ్ లు ఇస్తున్నారు.

పరామర్శల రాజకీయాలలో రజిని ఉంటే.. టిడిపి నాయకులు ఆమెకు చేయాల్సిన నష్టాన్ని చేసేశారు. సెంటిమెంట్ పొలిటికల్ గేమ్ ఆడుతున్న రజినీకి టిడిపి నాయకులు గట్టిగానే చెక్ పెట్టారు. రజని ఎంతో నమ్మకంగా కొంతమంది అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే ఆమె పరామర్శ పాలిటిక్స్ చేస్తుంటే.. పోటీలో నిలిచిన వారు సైలెంట్ గా టిడిపి వైపు వెళ్లిపోయారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రజిని కరీమున్ ను ప్రతిపాదించారు. ఆమె ఏకంగా ఫ్యాన్ పార్టీకి నమస్కారం పెట్టి.. పసుపు రంగు కండువా కప్పుకున్నారు. అంతేకాదు టిడిపి అభ్యర్థి గెలుపు కోసం ఆమె స్వయంగా ప్రచారంలోకి దిగారు. ఇది వైసిపికి దిమ్మతిరిగే షాక్ అంటున్నారు అక్కడి విశ్లేషకులు.

కరీమున్ తో నామినేషన్ వేయించే విషయంలో.. వెనక్కి తీసుకోకుండా చూసుకోవడంలో రజని పకడ్బందీగా వ్యవహరించారు. వాస్తవానికి కరీ మూన్ వైసిపికి విధేయురాలుగా ఉంటుందా.. లేదా అనే విషయాన్ని అంచనా వేయడంలో రజిని విఫలమయ్యారు. దీంతో రజనికి చిలకలూరిపేటలో పట్టులేదని మరోసారి నిరూపితమైంది.

పోలీసులతో జరిగిన వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది రజిని. విక్టింగ్ కార్డు ప్లే చేసింది. రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకుంది. ఇంట్లోనే కూర్చుని సెంటిమెంట్ రాజకీయాలతో కాలక్షేపం చేసింది. కాకపోతే టిడిపి నాయకులు మరో విధంగా స్కెచ్ వేశారు. రజిని చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన మహిళను టిడిపి వైపు లాక్కున్నారు. దీంతో రజిని రాజకీయం చిలకలూరిపేటలో మరోసారి నవ్వుల పాలైపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper