Hyundai BAYON: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్తగా BAYON కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతికత.. అదిరిపోయే డిజైన్.. స్మార్ట్ మొబిలిటీ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఈ మోడల్ ను తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది.
ఆధునిక డిజైన్.. స్మార్ట్ టెక్నాలజీ
కొత్త హ్యుందాయ్ BAYON ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్టు సంస్థ చెబుతోంది. ఆధునిక డిజైన్ తో పాటు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు సంస్థ చెబుతోంది. పట్టణ ప్రాంతాలలో ప్రయాణించే వారికి, రోజువారి అవసరాలకు అనుబైన వాహనంగా దీనిని అందుబాటులో తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. కొత్తదనం కోరుకునేవారికి ఇందులో ఉన్నఫీచర్లు సరికొత్త అనుభూతి కలిగిస్తాయని కంపెనీ చెబుతోంది. ప్రస్తుత జనరేషన్ ఇష్టపడే సౌలభ్యాలు ఇందులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఆ ధరతో..
9.99 లక్షల ప్రారంభ ధరతో ఈ మోడల్ అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆటోమొబైల్ రంగంలో ఈ ధరతో కారును తీసుకురావడం ఆసక్తిని కలగజేస్తోంది. ముఖ్యంగా 10 లక్షల పరిధిలో కారు కొనాలంటే వినియోగదారులకు ఈ మోడల్ మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంజన్ సామర్థ్యం.. మైలేజ్.. వేరియంట్.. భద్రతా ఫీచర్లు.. బుకింగ్ వంటి వాటిని కంపెనీ అధికృత షోరూములలో తెలుసుకోవాలి.
ఈ మోడల్ కార్లో జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్.. అధునాతన భద్రతా ఫీచర్లు.. పెట్రోల్ ఇంజన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. 12.3 అంగుళాల రెండు కర్వ్ స్క్రీన్లు ఇందులో ఉన్నాయి.. 70 కి పైగా బ్లూ లింకు ఫీచర్లు.. ఓటిఏ అప్డేట్స్ ఇందులో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు.. ఈ ఎస్ సి.. హిల్ స్టార్ట్ అసిస్ట్.. 23 ఏ డి ఏ ఎస్ డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు.. వైర్లెస్ చార్జింగ్.. వెనుక ఏసి వెంట్స్ ఉన్నాయి.
డ్రైవింగ్ మోడ్ విషయానికి వస్తే ఏకో.. స్పోర్ట్, నార్మల్ విభాగాలు ఇందులో ఉన్నాయి.. ఈ కార్ పొడవు 4, 245 మిల్లీమీటర్లు.. వెడల్పు 1,810 మిల్లీమీటర్లు. ఎత్తు 1,650 మిల్లీమీటర్లు, వీల్ బేస్ 2600 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 205 మిల్లీమీటర్లు. ఆటోమేటిక్ వీరియంట్ క్లైమ్ డ్ మైలేజీ 18.6 కిలోమీటర్/ లీటర్. ఇక ఇందులో సిఎన్జి వేరియంట్ ను 2027 జనవరిలో కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉంది.