HomeNewsComedian Ali: కమెడియన్ అలీ కారణంగా వెంకటేష్, మహేష్ జీవితాలు మారిపోయాయి అనే విషయం మీకు...

Comedian Ali: కమెడియన్ అలీ కారణంగా వెంకటేష్, మహేష్ జీవితాలు మారిపోయాయి అనే విషయం మీకు తెలుసా!

Comedian Ali: కమెడియన్ అలీ కారణంగా వెంకటేష్ , మహేష్ బాబు జీవితాలు మారిపోయాయి అంటే నమ్ముతారా?, వెంకటేష్ కి అలీ కారణంగానే బాలీవుడ్ ఆడియన్స్ లో కాస్త గుర్తింపు వచ్చిందంటే ఒప్పుకుంటారా?, కొన్ని కొన్ని నిజాలు మనల్ని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంటాయి , అలాంటి నిజమే ఇది. కమెడియన్ గా మాత్రమే కాదు , హీరో గా కూడా అలీ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు […]

Comedian Ali: కమెడియన్ అలీ కారణంగా వెంకటేష్ , మహేష్ బాబు జీవితాలు మారిపోయాయి అంటే నమ్ముతారా?, వెంకటేష్ కి అలీ కారణంగానే బాలీవుడ్ ఆడియన్స్ లో కాస్త గుర్తింపు వచ్చిందంటే ఒప్పుకుంటారా?, కొన్ని కొన్ని నిజాలు మనల్ని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంటాయి , అలాంటి నిజమే ఇది. కమెడియన్ గా మాత్రమే కాదు , హీరో గా కూడా అలీ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన హీరో గా నటించిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీ ని షేక్ చేశాయి. సంవత్సరం రోజులకు పైగా థియేటర్స్ లో ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి చిత్రమే ‘యమలీల’. ఎస్ వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా , ఆరోజుల్లో ఇండస్ట్రీ ని ఊపేసింది.

కామెడీ తో పాటు గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్స్ లోకి వచ్చేలా చేసింది. ఈ సినిమాని టీవీ లో వస్తే ఇప్పటికీ వదలకుండా చూస్తుంటాము. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రమిది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్ వీ కృష్ణా రెడ్డి ఈ సినిమా కథ ని అలీ కోసం రాసుకోలేదు, సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసుకున్నాడు. బాలనటుడిగా మహేష్ బాబు కి అప్పట్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఈ కథ మహేష్ బాబు కి చాలా అద్భుతంగా సూట్ అవుతుంది , అతనితోనే చేద్దామని అనుకుంటున్నాను అంటూ కృష్ణ వద్దకు వెళ్లి కథని వినిపించాడట ఎస్ వీ కృష్ణా రెడ్డి. కృష్ణ కి కథ చాలా బాగా నచ్చింది, కానీ మహేష్ అప్పటికే సినిమాలు మానేసి చదువు మీద ద్రుష్టి పెట్టాడు , విదేశాల్లో ఉన్నాడు.

ఇప్పుడు మహేష్ చదువు ని డిస్టర్బ్ చెయ్యాలని అనుకోవడం లేదని, వేరే ఎవరితో అయినా ఈ సినిమా చేసుకోమని చెప్పాడట కృష్ణ. మహేష్ బాబు ని ఇవ్వలేకపోయాడు కానీ , కృష్ణ మాత్రం ఈ చిత్రం లో ఎస్ వీ కృష్ణ రెడ్డి కోసం ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించాడు. ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే ఎలా ఉండేది?, హీరో గా ఆయన సినీ ప్రస్థానం ‘రాజకుమారుడు’ తో కాదు , ‘యమలీల’ తోనే మొదలయ్యేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.

ఇక వెంకటేష్ కి అయితే ఈ చిత్రం అప్పట్లో తెగ నచ్చేసింది. ఆరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున వంటి వారు బాలీవుడ్ లో వరుసగా సూపర్ హిట్స్ ని అందించి , హిందీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. వెంకటేష్ కూడా ‘చంటి’ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేసాడు, అది కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ రెండేళ్ల తర్వాత ‘యమలీల’ చిత్రాన్ని హిందీలో హిందీ లో ‘టక్ధీర్ వాలా’ అనే పేరుతో రీమేక్ చేసాడు. ఇది కమర్షియల్ గా హిందీ లో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఆరోజుల్లో ఈ చిత్రాన్ని 2 కోట్ల 50 లక్షల రూపాయలతో తెరకెక్కించారు, బాక్స్ ఆఫీస్ వద్ద 5 కోట్ల 86 లక్షల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. అంటే నిర్మాతకు రెండింతల లాభాలు అన్నమాట. అలా అలీ హీరో గా నటించిన ఈ చిత్రం వెంకటేష్ , మహేష్ బాబు కెరీర్స్ లో అనూహ్యమైన మార్పులను తీసుకొచ్చాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper