Homeఆంధ్రప్రదేశ్‌Veligonda Project: 'వెలిగొండ'తో కొండంత ఆనందం.. బాబును ఇంత ఆనందంగా ఎప్పుడూ చూసి ఉండరు

Veligonda Project: ‘వెలిగొండ’తో కొండంత ఆనందం.. బాబును ఇంత ఆనందంగా ఎప్పుడూ చూసి ఉండరు

Veligonda Project:  కరువు నేలపై కృష్ణమ్మను పరవళ్ళు తొక్కింది. పశ్చిమ ప్రకాశం జిల్లాకు కృష్ణా నది నీరు వెళ్ళింది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అశేష జనవాహిని నడుమ కృష్ణమ్మకు జల హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తీవ్ర భావోద్వేగంతో సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రారంభోత్సవ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతులతో పాటు మహిళా రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆనందంతో మహిళా రైతులు నృత్యాలు […]

Veligonda Project:  కరువు నేలపై కృష్ణమ్మను పరవళ్ళు తొక్కింది. పశ్చిమ ప్రకాశం జిల్లాకు కృష్ణా నది నీరు వెళ్ళింది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అశేష జనవాహిని నడుమ కృష్ణమ్మకు జల హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తీవ్ర భావోద్వేగంతో సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రారంభోత్సవ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతులతో పాటు మహిళా రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆనందంతో మహిళా రైతులు నృత్యాలు చేశారు. వారిని చూసి చంద్రబాబు సైతం ఎంతో ఆనందించారు. కండువ తిప్పి మరి అక్కడ ఉన్న వారిని మరింత ఆనందింప చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

* సర్వత్రా సంబరమే..
మార్కాపురం జిల్లాలో ఈ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అంబరాన్ని తాకింది. కృష్ణమ్మకు జల హారతి ఇచ్చి.. పూలతో ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు. సరిగ్గా 30 సంవత్సరాల కిందట ఇదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రారంభోత్సవం చేయడంతో టిడిపి శ్రేణులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి. చంద్రబాబు ఇమేజ్ సైతం అమాంతం పెరిగిపోయింది. కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి తాకేసరికి ప్రతి ఒక్కరిలో ఆనందం వెల్లివిరిసింది. ఈ క్రమంలో ప్రజలు జయ జయ ద్వానాల నడుమ సీఎం ప్రారంభోత్సవం చేయగా.. ఎంతగానో ఆనందించారు ప్రజలు. ఒక సందడి వాతావరణం నెలకొంది. కోలాహలం కనిపించింది.

* ర్యాంపు పై నడుస్తూ..
సభ ప్రారంభంలోనే.. సభా వేదికకు అనుసంధానంగా ఒక ర్యాంపు ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరంగా ఆ ర్యాంపు పై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు చంద్రబాబు. ఈ క్రమంలో రైతులతో పాటు మహిళలు పచ్చటి కండువాలు తిప్పుతూ చంద్రబాబును ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో వారిలో ఆనందం వెల్లివిరిసింది. ఆనందోత్సవాలు, చప్పట్లతో సభ మార్మోగింది. ప్రస్తుతం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

 

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper