Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఉప్పాడ గుండె కోత.. ఇన్నాళ్ళకు తీరింది.. హాట్సాఫ్ డీసీఎం పవన్ కళ్యాణ్ సార్..

Pawan Kalyan: ఉప్పాడ గుండె కోత.. ఇన్నాళ్ళకు తీరింది.. హాట్సాఫ్ డీసీఎం పవన్ కళ్యాణ్ సార్..

Pawan Kalyan:మాట అంటే మాట.. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునేది లేదు. రాజకీయాలలో ఇటువంటి సిద్ధాంతాలను ఎంతమంది అమల్లో పెడతారు.. ఎంతమంది పాటిస్తారు.. మిగతావారు ఏమో తెలియదు గానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో నూటికి నూరు శాతం కాదు.. కోటి శాతం నిక్కచ్చిగా ఉంటారు. ఏపీ రాష్ట్రంలో తీర ప్రాంతం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల గ్రామాలు నిత్యం కోతలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలా ఇబ్బంది పడుతున్న గ్రామాలలో ఉప్పాడ […]

Pawan Kalyan:మాట అంటే మాట.. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునేది లేదు. రాజకీయాలలో ఇటువంటి సిద్ధాంతాలను ఎంతమంది అమల్లో పెడతారు.. ఎంతమంది పాటిస్తారు.. మిగతావారు ఏమో తెలియదు గానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో నూటికి నూరు శాతం కాదు.. కోటి శాతం నిక్కచ్చిగా ఉంటారు.

ఏపీ రాష్ట్రంలో తీర ప్రాంతం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల గ్రామాలు నిత్యం కోతలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలా ఇబ్బంది పడుతున్న గ్రామాలలో ఉప్పాడ ఒకటి. ఈ ప్రాంతంలో ప్రజలు నిత్యం సముద్రం కోత వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ కోత వల్ల గ్రామం లో ఉన్న చాలామంది ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. సముద్రం కోత కోస్తూ ఉండడం వల్ల ఈ గ్రామం రూపురేఖలు ప్రతి ఏడాది మారిపోతున్నాయి. సముద్రం ఇలా కోత కోయడం వల్ల భౌగోళికంగా కూడా విపరీతంగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో తీర రక్షణ గోడ నిర్మాణానికి గతంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని ఆయన అలాగే వదిలేయలేదు. వెంటనే అమల్లో పెడతామని ప్రకటించారు. చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ హామీని నిజం చేసే పనిలో ఉన్నారు.

ఉప్పాడ ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ కూడా నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. తీర రక్షణ కూడా నిర్మాణానికి సంబంధించి ఆకృతి.. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పనులను మొదలుపెట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతోంది. రక్షణ కూడా నిర్మించే క్రమంలో.. ఎక్కడ ఆ పని చేపట్టాలి.. గోడ పొడుగు ఏ స్థాయిలో ఉండాలి.. సముద్రపు అలలు తీవ్రస్థాయిలో వస్తే వాటిని తట్టుకునే విధంగా ఎలాంటి నిర్మాణం చేపట్టాలి.. వంటి అంశాల మీద నిపుణులు దృష్టి పెట్టారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఐఐటీ మద్రాస్ కు సంబంధించిన నిపుణులు ఉప్పాడ తీరంలో సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వరద ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అంతేకాదు డ్రోన్ సర్వే కూడా చేపట్టారు. ఈ సర్వే ద్వారా తీరం మొత్తాన్ని పైనుంచి పరిశీలించి బీచ్ పరిస్థితిపై ఒక అంచనాకు వస్తున్నారు.. సముద్రపు కోత వల్ల ఏ ప్రాంతం దెబ్బ తింటున్నది.. తీర రేఖ ఏవిధంగా మారుతుంది.. సముద్రపు జలాలు ఏ వైపుగా ప్రభావం చూపుతున్నాయి వంటి అంశాలను నిపుణులు సేకరిస్తున్నారు.

ఈ తీర ప్రాంతాన్ని కేవలం ఏదో పైపైన పరిశీలించడం కాకుండా… ఇసుక.. అందులో ఉన్న మట్టి.. వంటి వాటి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. తీరం పక్కనే ఉన్న వివిధ ప్రాంతాల నుంచి ఇసుక.. ఇతర మట్టి నమూనాలను బృందం సభ్యులు సేకరించారు.. వాటిని పరీక్షలకు పంపించారు. భూమి స్వభావం.. ఇతర విషయాలను అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే రక్షణ కూడా ఆకృతిని రూపొందించబోతున్నారు.

ఉప్పాడ లో సముద్ర ప్రాంతం కోతకు గురవుతున్న విషయం ఈనాటిది కాదు.. ప్రతి ఏడాది సముద్రం కొంత కొంత ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సముద్రపు కోత వల్ల తీర ప్రాంత భూమి మొత్తం తగ్గిపోవడంతో గృహాలు.. రోడ్లు.. ఇతర వాటి మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఈ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. పవన్ కళ్యాణ్ గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు . పర్యావరణ మంత్రి హోదాలో రక్షణ గోడ నిర్మిస్తామని ప్రకటించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper