Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivasarao- Madhuri : దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంటకు షాక్.. ఏకంగా ఇంటికి వెళ్లి...

Duvvada Srinivasarao- Madhuri : దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంటకు షాక్.. ఏకంగా ఇంటికి వెళ్లి మరీ పోలీసులు..!

Duvvada Srinivasarao- Madhuri :  లేటు వయసులో ఘాటు ప్రేమ. ఆయనకు 58.ఈమెకు 35. ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. అది కచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట అని. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలు ఆయనకు.. చదువుకు పంపించాల్సిన పిల్ల ఉన్న ఆమెకు మధ్య ప్రేమ బంధం ఏర్పడడం తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ జంట హల్ చల్ చేస్తోంది. సెలబ్రిటీ జంటగా మారిపోయింది. ఈ ఆదర్శ జంట కొద్ది రోజుల కిందట తిరుమలలో ప్రత్యక్షమైంది. శ్రీవారిని దర్శించుకుని అక్కడే రీల్స్ చేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కూడా అయింది. బి.ఎన్.ఎస్ 292 ,296, 300 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో మరో మారు వార్తల్లో నిలిచారు దువ్వాడ శ్రీనివాస్,మాధురి జంట. గత కొద్ది రోజులుగా తెలుగు ప్రజలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట వినోదం పంచింది. ఎన్నెన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు తిరిగింది ఈ కుటుంబ కథ చిత్రం. చివరకు దువ్వాడ కొత్త ఇంటిని మాదిరి పేరిట రాయడంతో ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు ఇరు వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విచారణ కొనసాగుతోంది.

* తిరుమలలో హల్ చల్
సందట్లో సడేమియా అన్నట్టు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా ఈ జంట తిరుమలలో ప్రత్యక్షమైంది. త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది ఈ జంట. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తో లీగల్ గా తెగ తెంపులు చేసుకొని..త్వరలో తాము ఒక్కటవుతామని ప్రకటించారు మాధురి. తమది పవిత్రమైన బంధం అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో తిరుమల పరిసర ప్రాంతాల్లో మాధురి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.అయితే అవి ఫ్రీ వెడ్డింగ్ వేడుక కోసమేనని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దీంతో తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

* రీల్స్ చేయలే
అయితే తాము తిరుమలలో ఎటువంటి రీల్స్ చేయలేదని మాధురి చెబుతున్నారు. కేవలం దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలిగా మాత్రమే తిరుపతి వెళ్ళినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది ఈ జంట. దీంతో జనసైనికుల నుంచి విపరీతమైన ట్రోల్స్ రావడంతో దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యేక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఇక తాము పవన్ వ్యక్తిగత జోలికి వెళ్ళమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు నోటీసులు అందించడంతో మండిపడుతున్నారు. మొన్నటివరకు తిరుమల లడ్డుపై ప్రచారం చేశారని..ఇప్పుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తిరుమలలో జరిగిన వ్యవహారాలకు తమకు సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి అయితే దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంటకు పెద్ద షాక్ తగిలినట్లు అయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular