Homeఆంధ్రప్రదేశ్‌AP DSC Recruitment:రామకృష్ణకు టీచర్ ఉద్యోగమే రాలేదు.. సాక్షి తల ఎక్కడ పెట్టుకుంటుంది..

AP DSC Recruitment:రామకృష్ణకు టీచర్ ఉద్యోగమే రాలేదు.. సాక్షి తల ఎక్కడ పెట్టుకుంటుంది..

AP DSC Recruitment: “ఏపీలో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయి.. అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు జరిగాయి.. స్పోర్ట్స్ కోటాలో అవినీతి రాజ్యమేలింది. నారా లోకేష్ వందల కోట్లు సంపాదించారు. ఇదంతా పెద్ద కుంభకోణం”.. ఇదే కదా సాక్షి ఆవేదన.. వైసీపీ ఆవేదన.. వైసిపి.. జగన్.. సాక్షి మీడియా వ్యవహార శైలి ఎలా ఉంటాయంటే.. వాళ్లు పట్టుకున్న కుందేలుకు రెండు కాళ్లు మాత్రమే ఉంటాయి. నాలుగు కాళ్లు ఉన్నాయని చెబితే వాళ్ళు నమ్మరు. పైగా రెండు కాళ్లు […]

AP DSC Recruitment: “ఏపీలో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయి.. అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు జరిగాయి.. స్పోర్ట్స్ కోటాలో అవినీతి రాజ్యమేలింది. నారా లోకేష్ వందల కోట్లు సంపాదించారు. ఇదంతా పెద్ద కుంభకోణం”.. ఇదే కదా సాక్షి ఆవేదన.. వైసీపీ ఆవేదన..

వైసిపి.. జగన్.. సాక్షి మీడియా వ్యవహార శైలి ఎలా ఉంటాయంటే.. వాళ్లు పట్టుకున్న కుందేలుకు రెండు కాళ్లు మాత్రమే ఉంటాయి. నాలుగు కాళ్లు ఉన్నాయని చెబితే వాళ్ళు నమ్మరు. పైగా రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయని వితండవాదం చేస్తూ ఉంటారు. అలా కాదని చెప్పినప్పటికీ వినిపించుకునే ప్రయత్నం చేయరు. సాక్షి మీడియా తీరు.. వైసీపీ నాయకుల వ్యవహార శైలి.. మారదు. పైగా డీఎస్సీలో వారు చేస్తున్న అన్వేషణ పరమ దరిద్రంగా ఉంది. తాజాగా సాక్షి టీవీ ఛానల్ లో ప్రైవేట్ టీచర్ గురించి దారుణమైన కథనాలు ప్రసారమయ్యాయి.

ఆ వ్యక్తి పేరు వేమూరి రామకృష్ణ. స్వస్థలం ఉమ్మడి కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు.. ఇతడు ఒక ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతడు డీఎస్సీ రాసినప్పటికీ ఉద్యోగం రాలేదు.. మొదట్లో బాధపడ్డాడు.. ఆ తర్వాత మళ్లీ ఇంకొకసారి ప్రయత్నిద్దాం అన్నట్టుగా అనుకున్నాడు. సాధారణ కుటుంబం కావడంతో మళ్ళీ తన ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగానికి వెళ్తున్నాడు. రామకృష్ణ ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్గా పని చేస్తున్నప్పటికీ సాక్షి టీవీకి.. ఒంగోలుకు చెందిన రాధిక అనే మహిళకు వేరే విధంగా అనిపించింది. రామకృష్ణకు డీఎస్సీలో అక్రమంగా ఉద్యోగం ఇచ్చారని.. ఆయన ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఎంపికైపోయారని ఒక అద్భుతమైన కల్పిత కథనాన్ని రాధిక సాక్షి టీవీలో ఆవిష్కరించారు. దీంతో ఆ కథనం చూసిన రామకృష్ణకు దిమ్మ తిరిగిపోయింది. అసలు నాకు డీఎస్సీలో ఉద్యోగం రావడం ఏంటని అతడు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో వైసిపికి ప్రతిపక్ష హోదా లేదు. వైసిపి మౌత్ పీస్ సాక్షికి క్రెడిబుల్టి లేదు. ఇలాంటి అప్పుడు ప్రజల్లో మెరుగ్గా పనిచేసే పోయిన విలువను కాపాడుకోవాలి. కానీ అలా పని చేయడం వైసిపికి చేతకాదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వల్ల కాదు. ఇక సాక్షి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఒక కుంభకోణాన్ని బయటపెట్టేముందు నిజాలను తెలుసుకోవాలి. వాటిని ప్రజల ముందు ఉంచాలి. అలాకాకుండా అద్దెకు దొరికిన మీడియా ద్వారా.. బాడుగ నేతల ద్వారా థర్డ్ గ్రేడ్ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే రిజల్ట్ దారుణంగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఆల్రెడీ ప్రూఫ్ అయింది. చివరికి తనకు ప్రభుత్వం ఉద్యోగం ఎవరు ఇచ్చారో చెప్పాలని రామకృష్ణ అడిగితే సాక్షి మీడియా దగ్గర సమాధానం లేదు. సాక్షి మీడియాలో గొంతు చించుకొని అరిచిన రాధిక దగ్గర ఆన్సర్ లేదు. పాపం పసుపులేటి ఈశ్వర్ అలియాస్ అరిచే ఈశ్వర్ ఈ విషయం మీద మాట్లాడతాడా.. వితండవాదం చేస్తాడా..అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper