Homeఆంధ్రప్రదేశ్‌Professor Nageshwar: సింపతి డ్రామా.. చాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారూ.. ఇక ఆపండి

Professor Nageshwar: సింపతి డ్రామా.. చాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారూ.. ఇక ఆపండి

Professor Nageshwar: ఒకప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే మేధావుల వర్గంలో గౌరవం ఉండేది. ఆయన అర్థవంతంగా తన విశ్లేషణలను సాగించేవారు. పలు పత్రికలకు ఆయన ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉండేవారు. అవి సరి కొత్త సమాచారాన్ని అందిస్తూ ఉండేవి. అందువల్లే నాగేశ్వర్ ను మేధావి అని పిలుస్తుంటారు. ఆయన ఎమ్మెల్సీ గా కూడా పని చేశారు. అటువంటి నాగేశ్వర్ ఇప్పుడు దారి తప్పినట్టు కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు వంతపాడే వ్యక్తిగా ఆయన మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గల్లి నుంచి ప్రపంచదాకా జరిగే అన్ని విషయాల మీద విపరీతమైన గ్రిప్ ఉన్న నాగేశ్వర్ న్యూట్రల్ గా మాట్లాడితే బాగుండేది. కానీ ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీని వేరే కోణంలో చూసినట్టు మాట్లాడారు. ఈయన సమక్షంలోనే పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీ జరిగినట్టు చెప్పుకోచ్చారు. వాస్తవానికి అక్కడ జరిగిన విషయం ఒకటైతే.. నాగేశ్వర్ మాట్లాడిన మాటలు మరొక విధంగా ఉన్నాయి. పైగా అవి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టే విధంగా ఉన్నాయి.

జగన్ అరెస్ట్ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని.. దానికి అమిత్ షా ఒప్పుకోలేదని.. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనుకుంటే.. వెంటనే చేసేస్తారు. దానికి పవన్ కళ్యాణ్ అనుమతి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి జగన్ అరెస్ట్ మీద మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలోని అంధ పాతాళానికి తోకేస్తానని పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారు. దానిని చేతల్లో చూపించారు.. ఇక కొత్తగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తొక్కాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు.

పవన్ కళ్యాణ్ ఆకాంక్షలు ఇప్పుడు వేరే విధంగా ఉన్నాయి. ఏపీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి.. నిధులు.. ఇంకా అనేక అంశాలు ఆయన మదిలో ఉన్నాయి. ఇటీవల అనారోగ్యానికి గురి అయిన తర్వాత చికిత్స పొందారు పవన్ కళ్యాణ్. అమిత్ షా కోరిక మేరకే ఆయన ఢిల్లీ వెళ్లారు.. ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించారు.. వచ్చే ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేయాలని.. ఏపీ రాష్ట్రాన్ని బాగు చేయాలని అమిత్ షా తో పవన్ కళ్యాణ్ చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీలో జరిగింది ఇది అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది మరొకటి.. పైగా తన మాట్లాడిన మాటలకు కౌంటర్ గట్టిగా రావడంతో ప్రొఫెసర్.. విక్టిమ్ కార్డు ప్లే చేయడం మొదలుపెట్టారు. దీనికి తెలంగాణలో టిఆర్ఎస్ అధినేత్రి కవిత.. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తోడయ్యారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ రగిలించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కట్టుకున్న ఇంటిని ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు. ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా దీనికి తోడయ్యారు.

ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తున్న అతి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే జరగని విషయాన్ని జరిగినట్టు చెప్పడం ఒక తప్పైతే.. దానిని తనకు అనుకూలంగా మార్చుకోవడం మరింత తప్పు. పైగా కొంతమంది ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అనుకూలంగా మాట్లాడారు. ఇక్కడ అనవసరంగా ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిలించి పబ్బం గడుపుకోవాలని సూచిస్తున్నారు. పైగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తనను దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ సవాల్ విసిరుతున్నారు. అలాంటి సవాల్ విసిరిన వ్యక్తి ఇలా చేయడమేంటి.. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో ప్రకటనలు చేయించడం ఏంటి.. పైగా డీజీపీని కలిసి తనకు భద్రత కల్పించాలని కోరడమేంటి.. అంతేకాదు టీవీ స్టూడియోలో యుద్ధం మీరు మొదలుపెట్టారు.. ముగింపు నేను ఇస్తానని రాజకీయ నాయకుడిలాగా మాట్లాడటం ఏంటి..

ఇవన్నీ చూస్తుంటే పకడ్బందీ రాజకీయ లక్ష్యాలతోనే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినట్టు అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నామని ఆ మాజీ ఎమ్మెల్సీ చెప్పినప్పుడు.. అంతటితోనే ఆ వ్యవహారాన్ని వదిలేయాల్సింది.. రాజకీయ నాయకులకు లక్ష్యాలు ఉంటాయి కాబట్టి వారు ఊహాజనితమైన మాటలు మాట్లాడుతుంటారు. కానీ విశ్లేషకులు అలా ఉండకూడదు.

ముఖ్యంగా న్యూట్రల్ గా ఉండేవారు అదే విధానాన్ని కొనసాగించాలి. అలాకాకుండా.. పక్కా పొలిటికల్ లీడర్ల మాదిరిగా మాట్లాడుతూ.. పొలిటికల్ పార్టీల లక్ష్యాలకు అనుకూలంగా వ్యవహరించే వారిని విశ్లేషకులు అనరు. అటువంటివారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఈ మాట అనడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. పైగా ఇంత జరిగిన తర్వాత కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ సింపతి కార్డు ప్లే చేయడం నిజంగా హాస్యాస్పదం.. ఇప్పటికే చాలా జరిగిపోయింది.. మహానటి సినిమాను మించిపోయింది.. అందువల్ల చివరి మాటగా ప్రొఫెసర్ గారు ఆపండి ఇక మీ అతి.. మీ పెయిడ్ ఆర్టిస్టులను శాంతింప చేయండి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular