Homeఆంధ్రప్రదేశ్‌Telangana BJP: తెలంగాణలో బిజెపిపై కుట్రకు వైసిపి సాయం!

Telangana BJP: తెలంగాణలో బిజెపిపై కుట్రకు వైసిపి సాయం!

Telangana BJP: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎవరికి ఎవరు మిత్రుడు.. ఎవరికి ఎవరు శత్రువు అన్నది తెలియకుండా పోతోంది. తెలంగాణలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు. అక్కడ గులాబీ పార్టీ గట్టిగానే దీనిపై రాజకీయ పోరాటం చేస్తోంది. బండి సంజయ్ ను రేవంత్ సర్కార్ కాపాడే ప్రయత్నం చేస్తుందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో ఈ కేసు విచారణ చేపడుతున్న న్యాయమూర్తి పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో అనుకూల తీర్పు ఇస్తే న్యాయమూర్తి భర్తకు ఓ పదవి ఆఫర్ చేశారు అనేది సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం. అయితే ఈ ప్రచారం చేసిన నిందితుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కావడం గమనార్హం. ఒకవైపు మనకు శాశ్వత మిత్రుడు జగన్ అంటూ బిజెపి పెద్దలు చెబుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అదే బిజెపి కేంద్రమంత్రి చుట్టూ జరుగుతున్న వివాదానికి.. గులాబీ పార్టీకి సాయం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా.

* బండి సంజయ్ కుమారుడికి వ్యతిరేకంగా
తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బండి సంజయ్ అనే నేత బిజెపికి చెందినవారు. ఆయన కుమారుడు లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. దానిని రాజకీయం చేస్తోంది గులాబీ పార్టీ. బండి సంజయ్ కు సీఎం రేవంత్ అండగా నిలుస్తున్నారు అనేది ఆ పార్టీ ప్రచారం. అదే ప్రచారం చేసింది వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్. అంటే పరస్పరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, గులాబీ పార్టీ సహకరించుకుంటున్నాయన్నమాట. అక్కడ బిజెపి కేంద్రమంత్రికి వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా తన బుద్ధిని బయట పెట్టుకుంది వైసీపీ. గెలవాలన్న ప్రయత్నంలో ఉంది తెలంగాణలో బిజెపి. అదే జరిగితే తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతోందని భయపడుతోంది గులాబీ పార్టీ. అదే గులాబీ పార్టీ అధికారంలోకి రావాలని కుట్రల్లో పాలుపంచుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఇలా ఒక విచిత్ర వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.

* గులాబీ టార్గెట్ అందుకే..
తెలంగాణలో బండి సంజయ్ బలమైన నేత. అధికారం నుంచి తమను దూరం చేశాడు అనే ఒకే ఒక్క కారణంతో బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది గులాబీ పార్టీ. బండి సంజయ్ ఇలాంటి బలమైన నేతను పలుచన చేస్తే బిజెపి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుందని భావిస్తోంది గులాబీ పార్టీ. ఒకవైపు బిజెపిని, మరోవైపు రేవంత్ సర్కార్ను బదనాం చేసేందుకు అవసరమైన సాయం అందిస్తోంది వైసిపి. ఒకవైపు జగన్ తమ శాశ్వత మిత్రుడు అంటూ బిజెపి పెద్దలు వ్యాఖ్యానించారు అంటూ ప్రచారం చేస్తోంది. అదే బిజెపిని తెలంగాణలో దారుణంగా దెబ్బతీస్తోంది. ఇక తెలుసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular