Homeఆంధ్రప్రదేశ్‌Nandamuri Taraka Rama Rao Jayanthi: 'అందరివాడు' ఎన్టీఆర్.. బర్త్ డే స్పెషల్!

Nandamuri Taraka Rama Rao Jayanthi: ‘అందరివాడు’ ఎన్టీఆర్.. బర్త్ డే స్పెషల్!

Nandamuri Taraka Rama Rao Jayanthi: నందమూరి తారక రామారావు.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా ఉండేవారు. విలక్షణమైన తన నటనతో, డైలాగ్ డెలివరీతో సినిమాను నిలబెట్టిన ఒక యోధుడు. నటనలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించే తీరు అమోఘం. ఎటువంటి మాధ్యమాలు లేని సమయంలో.. సినిమా మాధ్యం ద్వారా సమాజాన్ని మేలుకొలిపిన గొప్ప కథానాయకుడు.. అంతకుమించి గొప్ప నాయకుడు. ఆరు పదుల వయసులో పార్టీని ఏర్పాటు […]

Nandamuri Taraka Rama Rao Jayanthi: నందమూరి తారక రామారావు.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా ఉండేవారు. విలక్షణమైన తన నటనతో, డైలాగ్ డెలివరీతో సినిమాను నిలబెట్టిన ఒక యోధుడు. నటనలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించే తీరు అమోఘం. ఎటువంటి మాధ్యమాలు లేని సమయంలో.. సినిమా మాధ్యం ద్వారా సమాజాన్ని మేలుకొలిపిన గొప్ప కథానాయకుడు.. అంతకుమించి గొప్ప నాయకుడు. ఆరు పదుల వయసులో పార్టీని ఏర్పాటు చేసి.. 9 నెలల కాలంలో అధికారంలోకి తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ లెజెండరీ పర్సన్ నందమూరి తారక రామారావు. ఆయన జయంతి ఈరోజు. ఏటా మే 28న ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటారు.

* నటనలో విశ్వరూపం..
ఇప్పుడు మాదిరిగా సినిమా సెట్టింగులు ఉండేవి కావు. ఇప్పుడు మాదిరిగా టెక్నాలజీ ప్రభావం కూడా ఉండేది కాదు. తెలియాల్సినదంతా నటన. ఆ నటన ద్వారా 24 ఫ్రేమ్స్ ను దాటి వెళ్ళాలి. ప్రేక్షకుడికి చేరువ కావాలి. ఇప్పుడు మాదిరిగా ఓటీటి వంటి ప్రత్యామ్నాయ మాధ్యమాలు ఉండేవి కావు. ఎవరైనా, ఎంతటి వారైనా థియేటర్ కు వచ్చి చూడాల్సిందే. సినిమాలో కథ ఉంటే.. కథా వస్తువు ఉంటే.. అన్నింటికీ మించి నటన కనిపిస్తేనే చూసే రోజులు అవి. అటువంటి సమయంలోనే తన నటనలో విశ్వరూపాన్ని చూపించారు. రాముడిగా కనిపించారు.. కృష్ణుడిగా కనిపించారు.. దుర్యోధనుడిగా కనిపించారు.. కర్ణుడుగా కనిపించారు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయడం నందమూరి తారక రామారావు కే సాధ్యం. వెండితెర ఇలవేల్పు మాత్రమే కాదు.. దేవుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మహామనిషి.

* పాలనలో ఆదర్శం..
రాజకీయాలు అంటే కటౌట్లు, సోషల్ మీడియాలో ప్రచారం, హైప్ క్రియేషన్.. కానీ ఇవి లేని రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాధికారం దక్కించుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనను కూకటి వేళ్ళతో పెకిలించి.. ప్రాంతీయ పార్టీలకు తన తెలుగుదేశం పార్టీ విజయం ద్వారా మార్గం చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలంగాణను పట్టిపీడిస్తున్న పట్వారి, పటేల్ వ్యవస్థను పూర్తిగా రూపుమాపారు. బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, చౌక ధరల దుకాణాలు వంటి వాటితో.. పేదల బతుకు మార్చారు. పేదలు బతికేలా చేశారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కుల,మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతుడు ఎన్టీఆర్. అందుకే అందరివాడు అయ్యారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper