Homeఆంధ్రప్రదేశ్‌Malla Reddy comments : చంద్రబాబు విజనరీ.. జగన్ కు ఫినిషింగ్ తెలవదు.. మల్లారెడ్డి షాకింగ్...

Malla Reddy comments : చంద్రబాబు విజనరీ.. జగన్ కు ఫినిషింగ్ తెలవదు.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

Malla Reddy comments : తెలంగాణ రాజకీయాలలోనే కాదు.. తెలుగు రాజకీయాలలో మల్లారెడ్డి ఒక సెన్సేషన్. ఆయన ఏం చేసినా సరే మండుతుంది. ఎలాంటి కామెంట్ చేసిన సరే సోషల్ మీడియాలో విస్ఫోటనం అవుతుంది. అందువల్లే చాలా వరకు చానల్స్ ఆయన వెంట పడుతుంటాయి. ఆయనను ఇంటర్వ్యూ చేస్తుంటాయి. కొన్ని సందర్భాలలో మల్లారెడ్డి ఆ అవకాశం మీడియాకు ఇవ్వరు. నేరుగా ఆయనే రంగంలోకి వచ్చి.. మీడియాకు కావలసిన మసాలా అందించి వెళ్తారు. అటువంటి మసాలానే మల్లారెడ్డి ఇటీవల మీడియాకు […]

Malla Reddy comments : తెలంగాణ రాజకీయాలలోనే కాదు.. తెలుగు రాజకీయాలలో మల్లారెడ్డి ఒక సెన్సేషన్. ఆయన ఏం చేసినా సరే మండుతుంది. ఎలాంటి కామెంట్ చేసిన సరే సోషల్ మీడియాలో విస్ఫోటనం అవుతుంది. అందువల్లే చాలా వరకు చానల్స్ ఆయన వెంట పడుతుంటాయి. ఆయనను ఇంటర్వ్యూ చేస్తుంటాయి. కొన్ని సందర్భాలలో మల్లారెడ్డి ఆ అవకాశం మీడియాకు ఇవ్వరు. నేరుగా ఆయనే రంగంలోకి వచ్చి.. మీడియాకు కావలసిన మసాలా అందించి వెళ్తారు. అటువంటి మసాలానే మల్లారెడ్డి ఇటీవల మీడియాకు వడ్డించారు. ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే..

మల్లారెడ్డిని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో తనకు టిడిపి పార్టీ 2014లో ఎంపీ టికెట్ ఇచ్చిన విధానం.. చంద్రబాబు తనను నమ్మిన తీరు.. ఇంకా రకరకాల వ్యవహారాలపై మల్లారెడ్డి కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు హైదరాబాదులో ఐటీ అభివృద్ధి.. తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాల అభివృద్ధి.. ఇంకా రకరకాల డెవలప్మెంట్ స్కీమ్స్ ను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప గొప్ప వ్యక్తులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. తనను చంద్రబాబు నమ్మారని.. టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో తను పార్టీ మారాల్సి వచ్చిందని మల్లారెడ్డి వివరించారు.

ఇక ఇదే సమయంలో మల్లారెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని స్కీమ్స్ బాగా చేశారని.. ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో విఫలమయ్యారని.. అందువల్లే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ తేడాగా వచ్చిందని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇక షర్మిల గురించి మల్లారెడ్డి జాగ్రత్తగా మాట్లాడారు. ఆమె రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆమె రాజకీయ ప్రయాణం అలా సాగుతుందని అసలు విషయం చెప్పకుండా దాటవేశారు.

మల్లారెడ్డి రాజకీయాలలో సీనియర్. వ్యాపారవేత్తగా.. ఇతర వ్యాపకాలు ఉన్న వ్యక్తిగా మల్లారెడ్డి సుపరిచితుడు. అందువల్లే ఆయన ఏం చేసినా సరే ఓపెన్ గానే ఉంటుంది. కష్టపడ్డానని చెప్పి.. పాలు.. పూలు అమ్మి ఇక్కడ దాకా వచ్చానని చెప్పడంలో కూడా భోళా తనం కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే మల్లారెడ్డి సోషల్ మీడియాలోనే కాకుండా.. పబ్లిక్ లైఫ్ లో కూడా సెన్సేషన్. ఏడుపదుల వయసులో కూడా ఆ స్థాయిలో హుక్ స్టెప్పులు వేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అది కేవలం మల్లారెడ్డికి మాత్రమే సాధ్యం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper