Homeఆంధ్రప్రదేశ్‌PM Modi: అదును చూసి జగన్‌ను దెబ్బకొట్టిన ప్రధాని.. ఎక్స్‌పీరియన్స్‌ అలాంటిది మరి!

PM Modi: అదును చూసి జగన్‌ను దెబ్బకొట్టిన ప్రధాని.. ఎక్స్‌పీరియన్స్‌ అలాంటిది మరి!

PM Modi: ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ సర్కార్ ను టార్గెట్‌ చేసి మాట్లాడడం ఇప్పుడు వైసీపీ నాయకులను టెన్షన్‌ పెడుతోంది. మోదీ ఆరోపణలకు తాము కౌంటర్‌ ఇస్తే ఏమౌతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ జగన్‌ సర్కార్‌పై చేసిన విమర్శలు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు మంచి ఊపు తెచ్చాయి.

రాయలసీమపై సెటైర్లు..
మోదీ ప్రధానంగా రాయలసీమ ముఖ్యమంత్రులపై సెటైర్లు వేయడం హాట్‌ పాపిక్ అయింది. రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారని, అయినా రాయలసీమకు ఎందుకు న్యాయం చేయలేదని మోదీ ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ కూడా రాయలసీమకు చెందినవాడు కావడంతో మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాయలసీమ యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మోదీ ఆరోపించారు.

మాఫియా కోసం పని..
వైసీపీ ప్రభుత్వం పేదల వికాసం కోసం పని చేయడం లేదని, మాఫియా వికాసం కోసం పనిచేస్తుందని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో వైసీపీ నాయకులు హడలిపోతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్‌ చేసిన మోదీ ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. దీంతో వైసీపీ నాయకులు బిత్తరపోయారు.

మొదట జగన్‌ గురించి మాట్లాడని మోదీ..
ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత రెండుసార్లు ఏపీకి వచ్చిన మోదీ వైసీపీ సర్కార్‌ గురించి, సీఎం జగన్‌ గురించి మాట్లాడలేదు. దీంతో వైసీపీకి అనుకూలంగానే ఉన్నారని భావించారు. కానీ, ఈసారి వైసీపీని టార్గెట్‌ చేసి విమర్శలు, ఆరోపణలు చేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ అనుభవం ఇప్పుడు టైం చూసి వైసీపీని టార్గెట్‌ చేయడంతో వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper