Homeఆంధ్రప్రదేశ్‌Sai Krishna Missing Case: ఆపరేషన్ కృష్ణలంక.. సాయి కృష్ణ జాడ ఎక్కడ.. పోలీసులు ఆ...

Sai Krishna Missing Case: ఆపరేషన్ కృష్ణలంక.. సాయి కృష్ణ జాడ ఎక్కడ.. పోలీసులు ఆ పని చేశారా..

Sai Krishna Missing Case: సరిగ్గా వారం పాటు ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన సాయి కృష్ణ వ్యవహారం.. కీలక మలుపు తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి.. సాయి కృష్ణ మాతృమూర్తిని పరామర్శించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు సాయి కృష్ణ అదృశ్యానికి సంబంధించి కీలక విషయాలను రాబట్టే పనిలో పడ్డాయి. మొత్తానికి ఆపరేషన్ కృష్ణలంకను వేగవంతంగా చేస్తున్నాయి.

ముమ్మరంగా దర్యాప్తు

సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు రెండవ రోజు కూడా విస్తృతంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ సి పి రాజశేఖర్ బాబును కలిశారు. ఆయన దగ్గర నుంచి కొన్ని వివరాలు సేకరించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సిబ్బందిని ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపల.. బయట ఉన్న నిఘా కెమెరాలను పరిశీలించారు.. ఫోరెన్సిక్ సైబర్ బృందం ఎన్విఆర్ పరికరాలను.. డివిఆర్.. హార్డ్ డిస్క్ ను పరిశీలించింది. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించింది.

సాయి కృష్ణ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయం కోసం వాడుకుంది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగి సాయి కృష్ణ మాతృమూర్తిని పరామర్శించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాదు అంబటి రాంబాబు సాయికృష్ణ ను పోలీసులు చంపేశారని ఆరోపించారు. సాయి కృష్ణకు బదులుగా నవీన్ రెడ్డి ఫోటో పెట్టి సంచలనం రేపారు. అయితే పోలీసులు ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టడంతో అంబటి రాంబాబు చెప్పింది మొత్తం అబద్ధమని తేలిపోయింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడంలో సాయికృష్ణ వ్యవహారం సద్దుమణిగింది. ఇక్కడితోనే కూటమి ప్రభుత్వం ఆగిపోలేదు. సాయి కృష్ణ వ్యవహారంలో పూర్తిస్థాయిలో నిజాలను బయట పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఆ పనిచేశారా..

గాదె సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు దారుణానికి పాల్పడ్డారా.. స్వర్గపురి ప్రాంతంలో అనాధ శవాలను ఖననం చేశారా.. నిబంధనలు కచ్చితంగా పాటించారా.. ఒకవేళ సాయి కృష్ణ వ్యవహారంలో కూడా అందరూ అనుమానిస్తున్నట్టుగానే అదే పని చేశారా.. అనే కోణంలో దర్యాప్తు బృందాలు ఆరాధిస్తున్నాయి. దర్యాప్తు బృందానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన శుక్రవారం విజయవాడ చేరుకున్నారు. విచారణలో వేగం పెంచారు. డీజీపీని కలిసి.. అనేక విషయాల గురించి చర్చించారు.. సాయి కృష్ణను మార్కాపురం నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు.. అతని తీసుకురావడానికి ఎవరిని పంపించారు.. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అప్పగించారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది..

నలుగురిని ప్రశ్నించారు

మరోవైపు సాయి కృష్ణ తీసుకొచ్చిన నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు.. మరోవైపు సిబ్బందిని పెండింగ్లో ఉన్న ఎన్ బి డబ్ల్యూ లను అమలు చేయడానికే సాయి కృష్ణ వద్దకు పంపించినట్టు ఏడిసిపి వివరించారని సమాచారం. దర్యాప్తు రెండో రోజు వేగంగా సాగింది. అయితే ఆదివారం కూడా దర్యాప్తును పూర్తి స్థాయిలో చేపట్టి… త్వరలోనే కీలకమైన విషయాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular