cockroach in pasta : ఇంట్లో రొటీన్ వంటకాలు తిని తిని బోర్ కొడితే.. చాలామంది హోటల్ వెళ్తుంటారు. అక్కడ నచ్చిన ఫుడ్ తింటుంటారు. నాలుకను బట్టి రుచులు.. డబ్బును బట్టి కోరికలు.. ఈ సిద్ధాంతం బయట హోటల్స్ లో తినే వాళ్లకు వర్తిస్తుంది.
ఆమె ఒక జర్నలిస్టు. ఇంట్లో పిల్లలు ఒకటే గోల చేయడంతో బయటకు తీసుకెళ్లారు. వారు ఆడుకున్న తర్వాత ఆకలిగా ఉందని చెబితే ఒక హోటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ పాస్తా ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా పాస్తా వచ్చింది. పిల్లలు తినడానికి సిద్ధమయ్యారు. తమ ప్లేట్ లో సర్వ్ చేసిన పాస్తాను చూసి వారి నోటిలో లాలాజలం అలా ఊరిపోయింది. తినడమే తరువాయి అనుకుంటుండగా.. వాళ్లకు అందులో ఒక వింత జీవి కనిపించింది.
వెంటనే ఆ పిల్లలు ఆ విషయాన్ని జర్నలిస్ట్ అయిన తమ తల్లికి చెప్పారు. దీంతో ఆమె వేడి వేడి పాస్తా ఉన్న ప్లేట్ చూశారు. అందులో వింత జీవి అతనికి కూడా కనిపించింది. ఇంకేముంది హోటల్స్ సిబ్బందిని నిలదీసింది. అయితే ఆ పాస్తా సర్వే చేసిన ప్లేట్లో ఆ వింత జీవి మరేంటో కాదు.. బొద్దింక.. ముంబైలోని లోయర్ పారేయల్ ప్రాంతంలో ఉన్న ఓ ప్లే గ్రౌండ్ ఏరియాలో ఉన్న రెస్టారెంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎన్డి టీవీ ప్రాఫిట్ ఛానల్లో బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్న శ్రీ మీ చౌదరి తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ హోటల్ ఏరియాలో మొత్తం చనిపోయిన బొద్దింకలు ఉన్నాయని.. దుర్వాసన వస్తుందని ఆయన ఆ వీడియోను ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. ఎఫ్డిఏ మహారాష్ట్ర అధికారులను ట్యాగ్ చేశారు.. పిల్లలు తినే పాస్తాలో బొద్దింకలు ఉన్నాయంటే.. వారు ఏ విధంగా ఫుడ్ కోర్టు మెయింటైన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని చౌదరి వాపోయారు.
బొద్దింకలు ఉన్న ఆహారం అత్యంత ప్రమాదకరం. వాటి శరీరంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా.. వైరస్ ఉంటుంది. అందువల్లే వంట ఉండే ప్రదేశాలు శుభ్రంగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు. కానీ నేటి కాలంలో హోటల్ నిర్వాహకులు అటువంటి పద్ధతులను.. శుభ్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నామనే కనీస స్పృహ కూడా లేకుండా.. ఆహార పదార్థాలు సర్వ్ చేస్తున్నారు. అందువల్లే బయట ఆహారం తినకూడదని.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
A cockroach was found in the pasta served to us after our kids had already eaten it. This is completely unacceptable @pokiddojunior, (#LowerParel) this is a serious food safety and hygiene lapse. They are literally playing with kids’ health. This is one of Mumbai’s popular kids’… pic.twitter.com/VDPrh20sx6
— Shrimi Choudhary श्रीमी (@Shrimichoudhary) July 29, 2026