Homeఆంధ్రప్రదేశ్‌Joseph Ravan Case: జోసెఫ్ రావణ్ కేసులో కొత్త ట్విస్ట్! వెలుగులోకి సంచలనాలు

Joseph Ravan Case: జోసెఫ్ రావణ్ కేసులో కొత్త ట్విస్ట్! వెలుగులోకి సంచలనాలు

Joseph Ravan Case: ఏపీలో జోసెఫ్ రావణ్ పై కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులతోపాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఆయన చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. దీనిని ఏపీ పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసిన క్రమంలో.. పాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్ గా గతంలో ఆయన చాలా […]

Joseph Ravan Case: ఏపీలో జోసెఫ్ రావణ్ పై కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులతోపాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఆయన చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. దీనిని ఏపీ పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసిన క్రమంలో.. పాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్ గా గతంలో ఆయన చాలా రకాల వీడియోలు చేశారు. ప్రధానంగా హిందూ సంప్రదాయాలతో పాటు దేవుళ్లను టార్గెట్ చేసుకున్నారు.. ఆ వీడియోలు బయటకు రావడంతో పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపింది. వరుసగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో ఆయన పై లోతైన విచారణ కొనసాగుతోంది. మతోన్మాద శక్తులతో పాటు జాతీయస్థాయి కుట్ర ఉందన్న అనుమానాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు వెలుగు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

* అశ్లీల వీడియోలు..
తాజాగా జోసెఫ్ రావణ్ కు చెందిన సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల ఒకటి నాయన అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఫోన్ చేస్తాను విశ్లేషించిన పోలీసులు అందులో కీలక సమాచారం ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే అప్పటికే రావని తెలివిగా తన ఫోన్లోని వీడియోలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అలా డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక షాకింగ్ అనిపిస్తోంది. అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పుడు మరో కోణం దొరికింది పోలీసులకు. రావణ్ బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేశారు. డేటా ఆధారంగా పదిమంది బాధితులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మరింత కఠినమైన కేసులు జోసెఫ్ రావణ్ పై మోపే అవకాశం ఉంది.

* కఠినమైన సెక్షన్లు..
ఇప్పటికే కఠినమైన చట్టం కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుతో రావణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ పలు సెక్షన్ల కింద, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ( ఉపా ) సెక్షన్ల కింద అభియోగాలు మోస్తారు. కోర్టులో హాజరు పరచగా ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. అయితే ఇప్పుడు కొత్తగా అమాయక యువతులను టార్గెట్ చేసి.. అశ్లీలంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై అదనపు సెక్షన్లు నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper