Homeలైఫ్ స్టైల్Government Apps : ఈ 3 ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్ లో కచ్చితంగా ఉండాలి!

Government Apps : ఈ 3 ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్ లో కచ్చితంగా ఉండాలి!

Government Apps : ప్రస్తుతం ప్రతి రంగం డిజిటలైజేషన్ గా మారుతోంది. ప్రైవైట్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఆన్ లైన్ లోనే చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే ఈ సేవలు యాప్ ల రూపంలో అందిస్తున్నారు. దీంతో వినియోగదారులు తమ మొబైల్ లో కొన్ని ముఖ్యమైన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీటిలో ముఖ్యంగా ఈ మూడు యాప్స్ కచ్చితంగా ఉండాలని టెక్ నిపుణులు అంటున్నారు. ఈ యాప్స్ ద్వారా […]

Government Apps : ప్రస్తుతం ప్రతి రంగం డిజిటలైజేషన్ గా మారుతోంది. ప్రైవైట్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఆన్ లైన్ లోనే చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే ఈ సేవలు యాప్ ల రూపంలో అందిస్తున్నారు. దీంతో వినియోగదారులు తమ మొబైల్ లో కొన్ని ముఖ్యమైన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీటిలో ముఖ్యంగా ఈ మూడు యాప్స్ కచ్చితంగా ఉండాలని టెక్ నిపుణులు అంటున్నారు. ఈ యాప్స్ ద్వారా డబ్బు ఆదా కావడంతో పాటు సమయం చాలా సేఫ్ అవుతుంది. ఇంతకీ ఆ మూడు యాప్స్ ఎలా ఉపయోగపడుతాయి? అవేంటి?

డిజి లాకర్:
డిజి లాకర్ అనేది భారత ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ యాప్. ఇందులో ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, విద్యా సర్టిఫికెట్లు, బీమా పత్రాలు వంటి అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవచ్చు. ఇవి ప్రభుత్వ గుర్తింపు పొందిన డిజిటల్ పత్రాలుగా అనేక సందర్భాల్లో చెల్లుబాటు అవుతాయి. ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు అసలు డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అవసరమైనప్పుడు మొబైల్‌లో ఉండే డిజీ లాకర్ ద్వారా చూపిస్తే చెల్లుబాటు అవుతాయి. దీంతో డాక్యమెంట్లు మాన్యువల్ గా తీసుకెళ్లే ఇబ్బంది తప్పుతుంది.

డిజీయాత్ర:
డిజీయాత్ర అనేది దేశీయ విమాన ప్రయాణికుల కోసం రూపొందించిన ప్రత్యేక యాప్. ప్రస్తుత కాలంలో చాలా మంది విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఎయిర్ పోర్టులు ప్రయాణీకులతో రద్దీగా మారుతున్నాయి. ఈ క్రమంలో బోర్డింగ్ కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే డిజీ యాత్ర యాప్ ద్వారా ఇంట్లోనే బోర్డింగ్ పాస్ ను అప్ లోడ్ చేయాలి. దీంతో ఒక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యేటప్పడు ఫేస్ రికగ్నేషన్ అడుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా క్యూ కట్టకుండా ప్రత్యేకంగా ఫేస్ చూపిస్తే చాలు.. మిగతా వారి కంటే ముందుగానే వెళ్లొచ్చు. దీంతో చాలా వరకు సమయం ఆదా అవుతుంది.
ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ :
ఇప్పుడున్న కాలంలో ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇందులో కొన్ని సైబర్ మోసాలు ఉంటున్నాయి. అయితే ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ అనే అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ అందిస్తున్న యాప్ . దీని ద్వారా సాధారణ ప్రజలు ప్రభుత్వ సెక్యూరిటీలు , సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టే అవకాశం పొందుతారు. మధ్యవర్తుల అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఖాతా తెరిచి పెట్టుబడులు పెట్టవచ్చు. ఇవి సెక్యూర్డ్ గా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper