Homeబిజినెస్iPhone Tips : చాలా మందికి తెలియని 4 ఐఫోన్ యూజ్ ఫుల్ ట్రిక్స్

iPhone Tips : చాలా మందికి తెలియని 4 ఐఫోన్ యూజ్ ఫుల్ ట్రిక్స్

iPhone Tips : ప్రస్తుతం చాలా మంది వద్ద ఐఫోన్లు ఉన్నాయి. వీటి ధర ఎక్కువ అయినప్పటికీ ఇందులో ఉండే ఫీచర్స్ కు అట్రాక్ట్ అయి వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంత మంది ఐఫోన్ యూజ్ చేస్తున్నా.. కూడా ఇందులో ఉండే కొన్ని ఆప్షన్ల గురించి పట్టించుకోరు. కానీ ఇందులో ఎన్నో ఉపయోగకరమైన ట్రిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫొటోను ఎడిట్ చేసే విషయంలో ఇది అద్భుతమైన ఆప్షన్లను కలిగి ఉంది. అలాంటి వాటిలో ఈ నాలుగింటి […]

iPhone Tips : ప్రస్తుతం చాలా మంది వద్ద ఐఫోన్లు ఉన్నాయి. వీటి ధర ఎక్కువ అయినప్పటికీ ఇందులో ఉండే ఫీచర్స్ కు అట్రాక్ట్ అయి వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంత మంది ఐఫోన్ యూజ్ చేస్తున్నా.. కూడా ఇందులో ఉండే కొన్ని ఆప్షన్ల గురించి పట్టించుకోరు. కానీ ఇందులో ఎన్నో ఉపయోగకరమైన ట్రిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫొటోను ఎడిట్ చేసే విషయంలో ఇది అద్భుతమైన ఆప్షన్లను కలిగి ఉంది. అలాంటి వాటిలో ఈ నాలుగింటి గురించి తెలుసుకుందాం..

ట్రిక్ 1:
చాలా మంది ఐఫోన్ తో ఫొటో తీసుకోవాలని కోరుకుంటారు. ఇప్పటి వరకు తీసిన ఫొటోలో అనవసరంగా చాలా వస్తువులు, మనుషులు పడుతూ ఉంటారు. వీటిలో వద్దని అనుకునేవి తొలగించాలనుకుంటే ఐఫోన్‌లో మంచి ఫీచర్ ఉంది. ముందుగా ఫోటోను ఓపెన్ చేసి ఎడిట్ పై క్లిక్ చేయాలి. అక్కడ క్లీన్ అప్ ఆప్షన్‌ను ఎంచుకుని తొలగించాలనుకున్న వస్తువుపై వేలితో రుద్దితే, ఆ వస్తువు ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. ఈ ఫీచర్ లేటెస్ట్ ఐఫోన్ లో మాత్రమే ఉంటుంది.

ట్రిక్ 2:
ఒక ఫోటోలోని వ్యక్తి లేదా వస్తువు (పాప్ అప్‌ లాగా)ను మాత్రమే వాట్సాప్ లేదా ఇతర యాప్‌లలో పంపించాలని అనుకుంటారు. ఇలా పంపించాలంటే ప్రత్యేకంగా కట్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటోను ఓపెన్ చేసి, అందులోని వ్యక్తి లేదా వస్తువుపై కొన్ని క్షణాలు గట్టిగా నొక్కి పట్టుకుంటే అది బ్యాక్‌గ్రౌండ్ నుంచి విడిపోయి పాప్ అప్‌లా కనిపిస్తుంది. ఆ తర్వాత దానిని డ్రాగ్ చేసి వాట్సాప్, మెసేజెస్ లేదా ఇతర యాప్‌లలో డ్రాప్ చేసి సులభంగా షేర్ చేయవచ్చు.

ట్రిక్ 3:
మొబైల్ లోన్న ఫొటోల్లో ఏదో ఒకటి బాగా నచ్చుతుంది. దీనిని మరింత ఆకర్షణీయంగా లాక్ స్క్రీన్ వాల్‌పేపర్‌గా ఉపయోగించుకోవాలని అనుకుంటే దీనిని థీమ్ లాగా తయారు చేసుకోవచ్చు. ఫొటోను ఓపెన్ చేసి కుడివైపున ఉన్న షేర్ అనే ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు థీమ్ తయారవుతుంది. దీనిన వాల్ పేపర్ లాగా వాడుకోవచ్చు.

ట్రిక్ 4:
ఐఫోన్ లో ఎన్నో రకాలా ఫొటోలు ఉంటాయి. వీటిలో డాక్యుమెంట్లు వెతకడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం గ్యాలరీల కింద ఉన్న సెర్చ్ బాక్స్ లో కావాల్సిన డాక్యుమెంట్ పేరు కొడితే ఆ పేరుతో ఉన్నవన్నీ డిస్ ప్లే అవుతాయి. విశేషమేంటంటే ఫొటోపై ఉన్న పేరుతో కూడా సెర్చ్ చేసినా కనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు ఆధార్ కార్డు ఫోటోను సేవ్ చేసి ఉంటే, ఫోటోస్ యాప్‌లోని సెర్చ్ బాక్స్‌లో Aadhaar అని టైప్ చేస్తే, ఆ పదం ఫోటోలో ఉన్నా కూడా సంబంధిత చిత్రం కనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper