Homeబిజినెస్Honda Rebel 500 : ఈ బైక్ కోసం కారును అమ్ముకోవాల్సిందే..!

Honda Rebel 500 : ఈ బైక్ కోసం కారును అమ్ముకోవాల్సిందే..!

మోడ్రన్ లుక్.. అత్యధిక వేగం.. మెరుగైన ఇంజిన్ కలిగి ఉండే బైక్ కోసం చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ అద్భుతమైన బైక్స్ ని అందిస్తుందని చాలా మంది భావన. కానీ ఈ కంపెనీకి ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చేందుకు కొత్త బైక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. డిజైన్ లోనే కాకుండా నేటి యూత్ కు అనుగుణంగా అన్ని రకాల ఫీచర్లను జోడించి ప్రవేశపెడుతున్నాయి. ఇలాంటి వాటిలో హోండాకు చెందిన ఓ […]

మోడ్రన్ లుక్.. అత్యధిక వేగం.. మెరుగైన ఇంజిన్ కలిగి ఉండే బైక్ కోసం చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ అద్భుతమైన బైక్స్ ని అందిస్తుందని చాలా మంది భావన. కానీ ఈ కంపెనీకి ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చేందుకు కొత్త బైక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. డిజైన్ లోనే కాకుండా నేటి యూత్ కు అనుగుణంగా అన్ని రకాల ఫీచర్లను జోడించి ప్రవేశపెడుతున్నాయి. ఇలాంటి వాటిలో హోండాకు చెందిన ఓ బైక్ యూత్ ను టెంప్ట్ చేస్తోంది. దీనిని చూడగానే కొనేంత స్టైలిష్ గా ఉంది. అయితే దీని ధర ఎంత అన్న చర్చ నిన్నటి వరకు సాగింది. కానీ లేటేస్ట్ గా ఈ కొత్త బైక్ ప్రైస్ గురించి లీక్ అయింది. ఇంతకీ ఈ బైక్ ధర ఎంత? ఇది ఏ బైక్?

Honda కంపనీ నుంచి ఇప్పటికే చాలా వరకు ప్రీమియం బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే లేటేస్ట్ గా రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీకి చెందిన సూపర్ మెటియోర్ 650 బైక్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఒకటి మార్కెట్లోకి రాబోతుంది. అదే Honda Rebel 500. ఈ బైక్ అచ్చం రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లాగా అనిపించినా.. ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇది రెండు వేరియంట్లలో రాబోతుంది.

ఈ కొత్త బైక్ లో 471 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను చేర్చారు. దీనితో పాటు పారలల్ కూడా ఉండనుంది. ఈ ఇంజిన్ 46 బీహెచ్ పీ పవర్, 43.3 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ బ్రాండ్ ను ఇటీవల ప్రకటించారు. దీనిని చూడగాన ధర ఎంత అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బెంగుళూరుకు చెందిన బిగ్ వింగ్ డీలర్ దీనిని రూ. 5.49 లక్షలకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు వేరియంట్ల బైక్ లు ఒకే ధరకు ఉంటాయని తెలుస్తోంది.

ఈ ఏడాది చివరినాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. హోండా ఇటీవల గ్లోబల్ లెవల్లో ఈ మోడల్ ను విస్తరించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా దీనిని భారత్ లో రిలీజ్ చేయనున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper