Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు శుభవార్తలను అందుకుంటారు. మరికొన్ని రాశుల వారు వారు మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు పరిశీలించి తీసుకోవాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈరోజు నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. పర్వతలకు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. పాత స్నేహితులను కలవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. నిర్ణయాత్మకమైన ఆలోచనలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. నిరుద్యోగులు అవకాశాలను పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ప్రశంసలు అందుకుంటారు. అనవసరంగా ఇతరులకు డబ్బు ఇవ్వరాదు. ఎందుకంటే ఇవి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విభేదాల్లో చిక్కుకుంటారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. దీనివల్ల మీకే నష్టం ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కెరీర్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. మాటతీరుతో సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొన్ని పనుల నిమిత్తం ఇతరుల సహాయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. నిరుద్యోగులు శుభవార్తను అందుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఏర్పడుతుంది. ఆగిపోయిన పనులను ఏకాగ్రతతో పనిచేస్తే పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీంతో వ్యాపారులకు ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో చేసిన కృషికి సరైన ఫలితాలను పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. గతంలో చేసిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల సహాయం తీసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఆరోగ్యం కోసం సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. అనవసరపు వివాదాల్లోకి తలదుల్చకుండా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు. గతంలో చేసిన కొన్ని ముఖ్యమైన పనుల ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతారు. చిన్నపాటి వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.