SVBC Chairman: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా పనిచేస్తుంది ఎస్వీబీసీ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ గా సుపరిచితమైన ఎస్వీబీసీ ఏకంగా నాలుగు భాషల్లో శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్విబిసి చైర్మన్ పోస్ట్ ను భర్తీ చేయలేదు. అయితే ఎట్టకేలకు ఆ పోస్ట్ నియామకం చేపట్టింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ నేత శ్రీధర్ వర్మ పేరును ఖరారు చేసింది. అయితే ఈ పదవి కోసం సినీ పరిశ్రమ నుంచి చాలామంది పోటీపడ్డారు. ఒకానొక దశలో జనసేన నేతలకు అవకాశం ఇస్తారని భావించారు. నందమూరి బాలకృష్ణ సైతం కొందరి పేర్లను సిఫార్సు చేసినట్లు ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా టిడిపి నేత శ్రీధర్ వర్మకు ఆ పోస్టు లభించడం విశేషం.
* కనీసం అంచనాలు లేని..
కనీసం అంచనాలు లేకుండా శ్రీధర్ వర్మ పేరు ప్రకటన వెనుక సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. శ్రీధర్ వర్మ తండ్రి పేరు రాజు. ఎన్టీఆర్కు ఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. అందుకే ఆయనను ఎన్టీఆర్ రాజుగా కూడా పిలిచేవారు. ఆయన ఎన్టీఆర్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా కూడా పనిచేశారు. కాగా శ్రీధర్ వర్మ ఈనెల 22న ఎస్వీబీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
* చాలా రోజులుగా పార్టీ కోసం..
శ్రీధర్ వర్మ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో సేవలందిస్తూ వచ్చారు. తిరుపతికి చెందిన ఆయన టిడిపి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. పార్టీకి విధేయుడుగా ఉన్న వర్మకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి దక్కింది. దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. అయితే 2014లో ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటయింది. అప్పట్లో ఎస్వీబీసీ చైర్మన్గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఆ బాధ్యతలు చేపట్టారు. ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అటు తరువాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఓ మాజీ ఎమ్మెల్యే కు ఆ బాధ్యతలు అప్పగించింది.
* చాలామంది ఆశావాహులు..
ఎస్ వి బి సి చైర్మన్ పోస్ట్ కోసం చాలామంది సినీ పరిశ్రమ నుంచి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రధానంగా మురళీమోహన్, అశ్విని దత్ లాంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఈ పోస్ట్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కొన్ని పేర్లు సిఫారసు చేసినట్లు వార్తలు వచ్చాయి. బాలకృష్ణ సైతం కొందరి పేర్లతో ప్రయత్నాలు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ చివరకు నందమూరి తారక రామారావు సన్నిహితుడి కుమారుడికి ఈ కీలక పదవి దక్కడం విశేషం.
View this post on Instagram