Anam Ramanarayana Reddy: రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతిలో సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 28 జిల్లాల్లో ఆయా ఇన్చార్జ్ మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. వేడుకగా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే తిరుపతి జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకలకు రాష్ట్రమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను గట్టిగా పట్టుకున్నారు. కింద పడకుండా అడ్డుకున్నారు. వైద్యులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ప్రాథమిక వైద్యం అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
* సీనియర్ మంత్రిగా..
ఏపీ క్యాబినెట్లో సీనియర్లలో ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు. ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారి నీరసానికి గురయ్యారు. పక్కకు వాలిపోతుండగా భద్రత సిబ్బంది గట్టిగా పట్టుకున్నారు. వైద్యులను పిలిచి చికిత్స అందించారు. కొద్దిసేపటికి మంత్రి రామనారాయణ రెడ్డి కోలుకున్నారు. తిరిగి యధావిధిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కసారిగా మంత్రి అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అక్కడే ఉండగా.. వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి సిబ్బంది సపర్యలు చేశారు. మంత్రి కోల్పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* పార్టీ శ్రేణుల్లో ఆందోళన..
ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. దాదాపు ఆయన వయసు 70 సంవత్సరాలకు పైగా ఉంటుంది. మొన్నటి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు. నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు తన క్యాబినెట్ లో తీసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా యాక్టివ్ గా పని చేస్తుంటారు. రాజకీయంగా కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురి కావడంతో అంతటా ఆందోళన వ్యక్తం అయింది. నెల్లూరు జిల్లా పార్టీ శ్రేణుల్లో అలజడి రేగింది. కానీ కొద్దిసేపటికి ఆయన కోలుకున్నారన్న వార్త తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
View this post on Instagram