Nara Lokesh: ఒక మనిషి ఎదుగుతుంటే ఈర్ష్య పడడం సాటి మనిషికి ఉన్న అలవాటు. ఇప్పుడు టిడిపి యువ నేత, మంత్రి లోకేష్( Minister Nara Lokesh) విషయంలో అటువంటి ఈర్ష్యతోనే ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు ఏపీ రాజకీయాల్లో మాత్రమే కనిపించారు నారా లోకేష్. కానీ తన తండ్రి అరెస్టు సమయం నుంచి ఆయన జాతీయస్థాయిలో కూడా పరిచయాలు పెంచుకున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ పరపతి అమాంతం పెరిగింది. కేంద్ర పెద్దలు కూడా ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యత, గౌరవాన్ని చూసి వైసిపి నేతలు ఇబ్బంది పడుతున్నారు. అభద్రతాభావంతో గడుపుతున్నారు. రాజ్యసభ గ్యాలరీలో లోకేష్ లైవ్ కెమెరాల్లో చూపించడం పై ఏకంగా ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే స్థాయికి వైసిపి దిగజారింది. తద్వారా లోకేష్ పై వారికి ఉన్న ఈర్ష్య భావం స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..
* ఇబ్బందులను దాటుకొని..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ బాధితుడే లోకేష్. తనను తాను ప్రూవ్ చేసుకుని ఈ స్థాయికి చేరాడు. అలాగని ఈ గుర్తింపు ఏదో ఈరోజు రాలేదు. చాలా రకాల ఇబ్బందులు పడి వాటిని అధిగమించి ఈ స్థాయికి వచ్చారు. చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ పడిన బాధ అంతా ఇంతా కాదు. ఢిల్లీకి ఒంటరిగా వెళ్లి జాతీయ మీడియా ముందు నిలబడ్డారు. వివిధ రాజకీయ పార్టీల అగ్ర నేతలను కలుసుకొని ఇక్కడి పరిస్థితిని వివరించారు. అలా తన పరిచయాలను పెంచుకుంటూ ముందుకు సాగారు. ఏపీలో కూటమి రావడం.. అదే కూటమిపై ఆధారపడి ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టడం వంటి కారణాలతో లోకేష్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు కేంద్ర పెద్దలు. చంద్రబాబు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి ఉండవచ్చు కానీ.. ఒక నాయకుడికి ఎదురయ్యే పరిణామాలను ఫేస్ చేశారు లోకేష్. ఆయనలో పరిణితి పెరగడం వల్లే కేంద్రంలో ఆయనకు ప్రాధాన్యం లభిస్తోంది. దీనిని చూసి తట్టుకోలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* ఇద్దరి మధ్య తేడా అదే..
జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ), నారా లోకేష్ కి చాలా తేడా ఉంది. తిరుగులేని రాజకీయ కుటుంబం నుంచి వచ్చి.. తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. వారసుడిగా వచ్చి తనకు ఎంత మాత్రం పరిచయం లేని మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే పంతంతో ముందుకు సాగి అదే మంగళగిరి నుంచి గెలిచి తనను తాను నిరూపించుకున్నారు. అయితే కూటమి వచ్చిన తర్వాత తన ప్రాభవాన్ని, ప్రాబల్యాన్ని తన తెలివితేటలతో పెంచుకుంటున్నారు లోకేష్. తొలుత ప్రతిపక్ష నేత అయ్యారు జగన్. తరువాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎప్పుడూ ఆయన తాడేపల్లి ప్యాలెస్ విడిచి రారు. జాతీయస్థాయి అంశాలపై ఆయనకు కనీస అవగాహన ఉండదు. ఆయనకు తెలిసిందల్లా బిజెపికి టచ్ లో ఉండడమే. వారు అడగకుండానే సాయం చేయడమే. కానీ లోకేష్ అలా కాదు నిరంతరం తన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ.. విదేశీ పెట్టుబడులు వంటి అంశాలపై నిత్యం చర్చలు జరుపుతూ ముందుకు సాగుతున్నారు.
* లోకేష్ ఎప్పుడో దాటిపోయారు.. అమరావతికి( Amravati capital ) చట్టబద్ధత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అయితే లోకేష్ ను రాజ్యసభ గ్యాలరీలో చూపించినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో ఇదే పద్ధతి అని వైసిపి తీరుపై జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. లోకేష్ ఇప్పటికే ఒక స్థాయికి వెళ్లిపోయారు. కుట్రలు చేయడం, ఇతరుల ఎదుగుదలను చూసి ఏడవడం మానేసి.. లోకేష్ ఎలా కష్టపడ్డాడు.. ఎలా తనను తాను మలుచుకున్నాడు అనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఫిర్యాదులతో నవ్వుల పాలు కావడమే తప్పించి మరొకటి జరగదు.
