Homeఆంధ్రప్రదేశ్‌Kesineni Nani appeal to Chandrababu: తమ్ముడుని తప్పిస్తే ఓకే.. చంద్రబాబుకు కేశినేని నాని విన్నపం

Kesineni Nani appeal to Chandrababu: తమ్ముడుని తప్పిస్తే ఓకే.. చంద్రబాబుకు కేశినేని నాని విన్నపం

Kesineni Nani appeal to Chandrababu: విజయవాడలో కేశినేని సోదరుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటి ఎన్నికల ముందు టిడిపిలో ఉన్న కేసినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒక వ్యూహం ప్రకారం తనను టిడిపి నుంచి బయటకు పంపించి ఎంపీ అయ్యారని సోదరుడు కేశినేని చిన్ని పై నానికి ఆగ్రహం ఉంది. అనవసరంగా టిడిపికి గుడ్ బై చెప్పి ఇబ్బందులు పడ్డానని […]

Kesineni Nani appeal to Chandrababu: విజయవాడలో కేశినేని సోదరుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటి ఎన్నికల ముందు టిడిపిలో ఉన్న కేసినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒక వ్యూహం ప్రకారం తనను టిడిపి నుంచి బయటకు పంపించి ఎంపీ అయ్యారని సోదరుడు కేశినేని చిన్ని పై నానికి ఆగ్రహం ఉంది. అనవసరంగా టిడిపికి గుడ్ బై చెప్పి ఇబ్బందులు పడ్డానని భావించిన కేసినేని నాని క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే తన ఈ పరిస్థితికి కారణమైన సోదరుడు, ఎంపీ చిన్ని పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా చిన్ని అవినీతిని బయట పెడుతున్నారని.. తన అనుచరులపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ కేశినేని నాని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

అనుచరుడిపై కేసు..
ఇటీవల ఎంపీ కేసినేని చిన్ని పై నాని అనుచరుడు తాతినేని రాంబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో అతడి కుటుంబం పై కక్ష కట్టి పోలీసులతో తరచూ ఇబ్బంది పెడుతున్నారని.. అక్రమ కేసులు బనాయించి లేనిపోని ఇబ్బందులు కు గురి చేస్తున్నారు అంటూ కేసినేని నాని సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా ఒక కుటుంబం కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతోందని.. పోలీస్ శాఖను దుర్వినియోగం చేస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేసినేని చిన్ని అక్రమ సంపాదనకు సంబంధించి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని వేధిస్తున్నారని.. ఆ సొమ్ము చోరీకి గురైనట్లు చెప్పి వారందరిని తెచ్చి ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. అయితే కేశినేని చిన్ని పై అవినీతి విషయంలో మరి హైలెట్ చేస్తున్నారు నాని.

మళ్లీ టీడీపీలోకి..
అయితే క్రియాశీలక రాజకీయాలకు దూరమైన కేసినేని నాని టిడిపి నాయకత్వం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్టీపై కానీ.. ప్రభుత్వంపై కానీ ఎటువంటి విమర్శలు చేయడం లేదు. మరోసారి నాని టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయకత్వం పట్ల ఎంతో ఆకర్షణగా ఉండేవారు నాని. కేవలం తన సోదరుడు చిన్నిని ప్రోత్సహిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ ఒక్క నిర్ణయంతో తన రాజకీయ కెరీర్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టుకున్నారు. అందుకే చిన్నిని తప్పిస్తే మళ్లీ తాను టిడిపిలో యాక్టివ్ అవుతానని సంకేతాలు పంపుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper