Homeఆంధ్రప్రదేశ్‌TDP Governor Post News: టిడిపికి మరో గవర్నర్ పోస్ట్.. ఛాన్స్ ఆయనకే!

TDP Governor Post News: టిడిపికి మరో గవర్నర్ పోస్ట్.. ఛాన్స్ ఆయనకే!

TDP Governor Post News: మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఎన్నెన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు నరేంద్ర మోడీ. పుష్కరకాలం వరుసగా ప్రధాని బాధ్యతలు చేపట్టి జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. అందుకే 2029 సార్వత్రిక ఎన్నికలపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా నిన్ననే ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పుష్కరకాలం ప్రధానిగా చేసిన నరేంద్ర మోడీ అభినందన తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ దక్కించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ఈ సమావేశంలో 2029 ఎన్నికల రూట్ మ్యాప్ తయారు చేయాలని నిర్ణయించారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల ఆశలు,, ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర పెద్దలు డిసైడ్ అయ్యారు.

* కేంద్రంలో కీలక భాగస్వామి..
ప్రధానంగా ఏపీలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగు దేశానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగాను ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్రమంత్రి పదవులను ఇచ్చారు. గవర్నర్ గా అశోక్ గజపతి రాజును ఎంపిక చేశారు. గోవా గవర్నర్ గా నియమించారు. అయితే టిడిపికి ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవితో పాటు గవర్నర్ పోస్ట్ కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సీనియర్ నేతలు చాలామంది పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారిలో ఒకరికి గవర్నర్ పోస్ట్ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. గతంలో కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉండేది టిడిపి. కానీ ఆ సమయంలో గవర్నర్ పోస్ట్ కేటాయింపు అనేది జరగలేదు. ఈసారి ఎన్డీఏ వచ్చిన తర్వాత వరుసగా పదవులు వచ్చి పడుతున్నాయి.

* యనమల లేదా వర్ల..
టిడిపికి గవర్నర్ పోస్ట్ ఇస్తే ఎవరికీ కేటాయిస్తారని ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. ప్రధానంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్న రాజ్యసభ ఆశావహులు ఇద్దరు. పదవులు ఆశించారు కానీ వివిధ సమీకరణలో భాగంగా వీరికి ఛాన్స్ దక్కలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు యనమల. ఆయన అన్ని రకాల పదవులు చేశారు కానీ ఎంపీ కాలేదు. పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర రాజకీయాలను కూడా చూడాలన్నది ఆయన ఆశ. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు గవర్నర్ పోస్ట్ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు వర్ల రామయ్య సైతం సీనియర్ మోస్ట్ లీడర్. పలుమార్లు రాజ్యసభ పదవి కోసం ఆయన పేరు తెరపైకి వచ్చేది. అయితే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. గవర్నర్ పోస్ట్ కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఇద్దరిలో యనమలకు గవర్నర్, రామయ్యకు రాజ్యసభ పదవి ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper