Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Box Office Collection 15 Days: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన...

Dhurandhar 2 Box Office Collection 15 Days: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..

Dhurandhar 2 Box Office Collection 15 Days: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2: The Revenge) చిత్రం మొదటి 11 రోజుల థియేట్రికల్ రన్ ని చూసి ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ అయ్యింది. కేవలం మొదటి వారం లోనే 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడమే కాకుండా, 11 రోజుల్లో 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ సినిమాకు కూడా […]

Dhurandhar 2 Box Office Collection 15 Days: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2: The Revenge) చిత్రం మొదటి 11 రోజుల థియేట్రికల్ రన్ ని చూసి ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ అయ్యింది. కేవలం మొదటి వారం లోనే 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడమే కాకుండా, 11 రోజుల్లో 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ సినిమాకు కూడా జరగలేదని , ఇదొక వెండితెర సునామీ అంటూ కామెంట్స్ చేశారు. అయితే 12 వ రోజు నుండి వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పడిపోయాయి. అందుకు విశ్లేషకులు అనేక కారణాలు చెప్తున్నారు కానీ, మొదటి భాగం కి వచ్చినంత రన్ , రెండవ భాగానికి రావడ లేదు అనే సత్యాన్ని మాత్రం కచ్చితంగా గ్రహించాల్సిందే. అయితే ఈ చిత్రం 15 రోజులు పూర్తి చేసుకోగా, బాక్స్ ఆఫీస్ వద్ద 1500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Also Read: మలయాళీగా రేవంత్.. ఆ మంత్రం పనిచేస్తే.. జరిగేది అదే

కేవలం డొమెస్టిక్ (ఇండియా) బాక్స్ ఆఫీస్ ని తీసుకుంటే ఈ చిత్రానికి 15 రోజుల్లో అన్ని భాషలకు కలిపి 961 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం హిందీ వెర్షన్ వసూళ్లు 900 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. గ్రాస్ ఓవరాల్ గా అన్ని భాషలకు కలిపి ఇండియా వైడ్ గా 1136 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి 15 రోజుల్లో 40 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూసుకుంటే 367 కోట్ల రూపాయిలు అన్నమాట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 1501 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాని బాలీవుడ్ లో మొట్టమొదటి 900 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన సినిమాగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

అంతే కాకుండా మొట్టమొదటి వెయ్యి కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన సినిమాగా కూడా ఈ చిత్రం నిలిచిపోతుందని అంటున్నారు. రెండవ వారం లో ఈ చిత్రం ఇండియా వైడ్ గా 251 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ సినిమా ముందు ఉన్న టార్గెట్స్ కేవలం మూడు మాత్రమే. ఒకటి పుష్ప 2 సాధించిన 1600 కోట్ల రూపాయిల గ్రాస్. అది ఈ వీకెండ్ తోనే దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రెండవ టార్గెట్ బాహుబలి 2. దాదాపుగా 1850 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం ఇది కష్టమని కొంతమంది అంటున్నారు కానీ , ఫుల్ రన్ లో దాటే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు కష్టమయ్యే టార్గెట్ ఏదైనా ఉందా అంటే , అది ‘దంగల్’ ని దాటడమే. దాదాపుగా 2000 కోట్ల గ్రాస్ ని రాబట్టాలి. ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper