YS Jagan Mohan Reddy: కేంద్రం మరో కీలకమైన చట్టాన్ని తీసుకురాబోతోంది. 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువకాలం జైల్లో గనక ఉండి ఉంటే ప్రజాప్రతినిధులు తమ పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను తీసుకురావాలని బిజెపి పెద్దలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కావలసినంత బలం లేకపోవడంతో.. సభ ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు బిజెపికి కావాల్సినంత బలం ఉన్న నేపథ్యంలో.. ఈ బిల్లు త్వరలోనే సభల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఎంతో కీలకమైన ఈ బిల్లుకు దేశంలో మెజారిటీ రాజకీయ పార్టీలు జై కొడుతున్నాయి. అయితే ఈ బిల్లుకు ఆంధ్ర ప్రదేశ్ లో ఒకప్పుడు అధికారంలో ఉన్న వైసిపి నో చెప్పింది. వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఈ బిల్లుకు సంబంధించిన చర్చ జరిగింది.. ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.. ఈ బిల్లు ప్రకారం రాజకీయ నాయకులు ఏమైనా కేసులలో 30 రోజులకు మించి జైల్లో ఉంటాయి పదవిని కోల్పోతారు. వారు ఎవరైనా సరే పదవికి దూరం కావాల్సిందే.
చట్టసభల్లో నేరస్తులు పెరిగిపోయిన నేపథ్యంలో వారి సంఖ్య తగ్గించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కఠినమైన చట్టాన్ని తీసుకొస్తుంది.. ప్రధానమంత్రి నుంచి మొదలుపెడితే ఎమ్మెల్యేల వరకు ఎవరైనా సరే 30 రోజులపాటు జైలు లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే పదవి కోల్పోతారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ఏకంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తీసుకురావాలని భావించింది. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత నాయకులు పదవిని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిబంధన ప్రకారం ఏదైనా కోర్టులో రెండు సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడితేనే ప్రజాప్రతినిధుల మీద అనర్హత వేటు పడనుంది.
వైసిపి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ఒకరకంగా ఆచారాన్ని కలిగిస్తుంది.. బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైసీపీ జై కొట్టింది.. కానీ ఇప్పుడు మాత్రం వైసిపి కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు నో చెప్పడం చర్చకు దారితీస్తోంది. అయితే దీని వెనుక వైసీపీ నేతల సొంత భయాలు దాగి ఉన్నాయి.
అక్రమ ఆస్తుల కేసులో జగన్ మీద ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగించాయి. ఆ విచారణ కూడా చివరి దశలో ఉంది. గతంలో 16 నెలల పాటు జగన్ జైలో ఉన్నారు. ఇక ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో జగన్ మళ్ళీ అరెస్టు కావచ్చు అని ప్రచారం కూడా ఉంది.. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చే చట్టం కనుక అమల్లోకి వస్తే జగన్ మరొకసారి గనుక 30 రోజులపాటు జైలుకు వెళ్లాల్సి వస్తే వైసిపికి సమస్యలు తప్పవు. అందువల్ల జగన్ రక్షించుకోవడానికి.. కేంద్రం తీసుకొచ్చిన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఓటింగ్ వరకు వెళ్తే భయం వల్ల వైసీపీ కేంద్రానికి సపోర్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఏం చేస్తుందో..
