Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: షర్మిల మాటలతో షేక్ అవుతున్న జగన్

YS Sharmila: షర్మిల మాటలతో షేక్ అవుతున్న జగన్

YS Sharmila: సోదరి షర్మిలను జగన్ లైట్ తీసుకున్నారు.ఏం చేస్తుందిలే అని భావించారు. తన ముందు ఆమె ఎంత అని తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆమె ఒక పట్టాన విడిచి పెట్టడం లేదు. ముఖ్యంగా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై గట్టిగానే మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆమె ద్వారా గట్టిగానే డ్యామేజ్ కలుగుతోంది. అందుకే ఆమెను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు ఆమె వివేకా హత్య గురించి ప్రస్తావించకుండా చేయాలని కోర్టును ఆశ్రయించారు. అయినా సరే ఆమె వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆమెను ఎలా కంట్రోల్ చేయాలో జగన్కు తెలియడం లేదు. ఈ అయోమయ స్థితిలో ఏవేవో మాటలు చెబుతున్నారు. మొన్నటికి మొన్న సోదరి పసుపు చీర ధరించడం పై కూడా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు షర్మిల పర్యటనకు పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యేలా ఆదేశాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

పులివెందులలో జగన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సోదరి షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులకు ఆమె చేతులు కలిపారని కూడా ఆరోపించారు. దీనిపై షర్మిల కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే అలా స్పందించిన మరుసటి రోజు ఆమెకు పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యింది. దెందులూరు లో షర్మిల సభ అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు చేతులెత్తేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే షర్మిల కాన్వాయ్ గంటకు పైగా ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఇలా సభ ముగిసిందో లేదో పోలీసులు అక్కడ నుంచి జారుకున్నారు. కనీసం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. దీంతో షర్మిల ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ట్రాఫిక్ ను క్లియర్ చేసుకోవాల్సి వచ్చింది.

తనకు ఎదురవుతున్న పరిణామాలతో షర్మిల కూడా వైసీపీ సర్కార్పై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. జగన్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదని.. ప్రధాని మోదీ వారసుడంటూ చేసిన వ్యాఖ్యలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. షర్మిల ఈ తరహా వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తుండడంతో జగన్ సైతం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందుకే షర్మిల విషయంలో ఎటువంటి రాజీవద్దని.. ఆమె తమ కుటుంబ సభ్యురాలు అని మినహాయింపు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీసు తో పాటు ఇతర వ్యవస్థలు సహాయ నిరాకరణ చేస్తున్నాయని తెలుస్తోంది. ప్రచారపర్వం తుది అంకానికి వచ్చిన తరుణంలో.. షర్మిల అంటేనే జగన్ భయపడిపోతున్నట్లు సమాచారం. అయితే షర్మిల సభలకు ఆంక్షలు, సహాయ నిరాకరణ మొదటికే చేటు తెస్తాయని.. వైసిపి మెడకు చుట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper