Ram Charan: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు ఇచ్చినంతవరకే హీరోకి, దర్శకుడి కి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఒకసారి అది చెడిపోయిందంటే మాత్రం మళ్లీ కలవడం చాలా కష్టంతో కూడుకున్న పననే చెప్పాలి. ఒక సినిమా ఫ్లాప్ అయితే నిజంగానే హీరో, దర్శకుడి మధ్య సంబంధాలు చెడిపోతాయా అంటే కొన్ని సిచువేషన్ లో చెడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన దానికి పూర్తి బాధ్యత దర్శకుడిదే. కాబట్టి ఫైనల్ గా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన హీరోగాని, ప్రొడ్యూసర్ గానీ ఆ దర్శకుడితో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నపుడు అలా ఉంటే వర్కౌట్ అవ్వవు కొన్ని సీన్స్ ను ఆడ చేద్దాం, ఇంకొన్ని సీన్స్ ను తీసేద్దాం అనే సలహాలను ఇస్తుంటారు. ఈ క్రమంలోనే దర్శకుడు వాళ్ళకి క్లారిటీ వచ్చేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పర్లేదు. కానీ అలా కాకుండా మూర్ఖంగా వాళ్ళు చెప్పింది ఎందుకు పెట్టుకోవాలి అనే ధోరణిలో ముందుకు సాగితే మాత్రం ఒకవేళ సినిమా తేడా కొడితే అందరి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సినిమా సక్సెస్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు. ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం చాలా మంది చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ కి ప్లాప్ ను కట్టబెట్టిన శంకర్ తో ప్రస్తుతం రామ్ చరణ్ మాట్లాడటం లేదనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా శంకర్ హైదరాబాద్ కి వచ్చినప్పుడ రామ్ చరణ్, శంకర్ ఇద్దరు ఒక ఫంక్షన్ లో కలిసిన కూడా రామ్ చరణ్ అతనితో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడలేదట. కారణం ఏంటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. రామ్ చరణ్ రెండు సంవత్సరాల పాటు డేట్స్ మొత్తం ఆ సినిమా మీదనే కేటాయించారు. కానీ శంకర్ ఆ డేట్స్ ను వేస్ట్ చేశాడు. నిజానికి రామ్ చరణ్ లాంటి నటుడు డేట్స్ ఇస్తే అద్భుతమైన సినిమాని తెరకెక్కించగలిగే దర్శకులు చాలామంది ఉన్నప్పటికి రామ్ చరణ్ మాత్రం శంకర్ కి డేట్స్ ఇచ్చాడు. ఇక అది పోను శంకర్ ఏడు గంటలకు పుటెజ్ తీశారట.
అందులో ట్రిమ్ అవ్వగా 5 గంటలకి వచ్చిందట. ఇక ప్రస్తుతం ఉన్న డ్యూరేషన్ కి తీసుకురావడానికి చాలా కసరత్తులైతే చేశారట. అంటే శంకర్ కి ప్రాక్టికల్ గా ఎంత తీయాలి అనే ఒక క్లారిటీ లేదు. రాండమ్ గా ఏది పడితే అది తీసుకొని వెళ్లి ఫైనల్ గా ఎడిటింగ్ సమయంలో చూసుకుందాం అనే వైఖరిని శంకర్ పాటిస్తాడు. కానీ అది అన్ని సినిమాలకు వర్కౌట్ అవ్వదు.
నిజానికి అలా చేయడం వల్ల సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే రామ్ చరణ్ కి శంకర్ మేకింగ్ అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికి ఆయన దుబారాగా డబ్బులు ఖర్చు పెట్టించే విధానం నచ్చలేదట. ఇక ఏదేమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా లేదంటే ఎవరైనా కావాలనే క్రియేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది…నిజానికి వీళ్లిద్దరు ఇప్పటికి ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటారని కొంతమంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఏదేమైనా కూడా రామ్ చరణ్ చాలా సాఫ్ట్ కార్నర్ కలవాడు. కాబట్టి అతను అందరితో మాట్లాడుతూ ముందుకు సాగుతుంటాడు. శంకర్ తో కూడా మాట్లాడుతాడు. కానీ అనుకోని కొన్ని సందర్భాలలో మాట్లాడలేకపోయి ఉండొచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుండటం విశేషం…