Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress IPACK Controversy: ఐప్యాక్ పై ఈడీ వల.. వణికిపోతున్న వైసిపి అగ్రనేతలు

YSR Congress IPACK Controversy: ఐప్యాక్ పై ఈడీ వల.. వణికిపోతున్న వైసిపి అగ్రనేతలు

YSR Congress IPACK Controversy: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఎప్పటినుంచో ఐప్యాక్ పనిచేస్తూ వస్తోంది. ఆ బృందానికి సమన్వయం చేసే వ్యక్తులు మారవచ్చు కానీ.. అదే బృందాన్ని కొనసాగిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కొనసాగిస్తున్నారు లేదో తెలియదు కానీ.. ఒకప్పుడు తనకు పని చేసిన ఐ ప్యాక్ డైరెక్టర్ రుషిరాజ్ సింగ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అవినీతి కేసుల్లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వలలో ఆయన […]

YSR Congress IPACK Controversy: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఎప్పటినుంచో ఐప్యాక్ పనిచేస్తూ వస్తోంది. ఆ బృందానికి సమన్వయం చేసే వ్యక్తులు మారవచ్చు కానీ.. అదే బృందాన్ని కొనసాగిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కొనసాగిస్తున్నారు లేదో తెలియదు కానీ.. ఒకప్పుడు తనకు పని చేసిన ఐ ప్యాక్ డైరెక్టర్ రుషిరాజ్ సింగ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అవినీతి కేసుల్లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వలలో ఆయన చిక్కుకున్నారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఏపీ పై పడింది. వందల కోట్ల లావాదేవీల విషయంలో ఐప్యాక్ కేసులను ఎదుర్కొంటోంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ఐప్యాక్ సంస్థపై జరుగుతున్న విచారణ లింకులు ఏపీ వైపు చూస్తున్నాయి. ఏపీలో వైసీపీకి సేవలు అందించిన రుషిరాజ్ సింగ్ కు ఈడి నుంచి పిలుపు వచ్చింది.

* కోల్ స్కాం లో ఐప్యాక్..
బెంగాల్లో కోల్ స్కాంలో ఐప్యాక్( IPac ) చిక్కుకుంది. ఆ సంస్థకు చెందిన డైరెక్టర్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు ఏపీలో జగన్ తో కలిసి పని చేసిన ఐప్యాక్ డైరెక్టర్ రుషిరాజ్ సింగ్ ను ఈడీ విచారణకు పిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీకి వ్యూహ కర్తగా పనిచేశారు రుషిరాజ్ సింగ్. ఐ ప్యాక్ ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ విచారణలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఐప్యాక్ కు మధ్య ఉన్న ఆర్థిక మూలాలు వెలికి తీయాలని కూడా ఈడీ భావిస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆందోళన మొదలైంది.

* పెద్ద ఎత్తున ఈడీ ఆరా..
ప్రధానంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఐప్యాక్ కు అందిన నిధుల వివరాలు, ఆ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులపై ఈ డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆడుదాం ఆంధ్ర అవినీతిలో కూడా ఐప్యాక్ కు భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా పశ్చిమబెంగాల్ కోల్ స్కామ్ లో ఐప్యాక్ చిక్కుకుంది. ఏపీ నుంచి సైతం భారీగా పెట్టుబడులు వెళ్లినట్లు వీడి అనుమానిస్తోంది. అందుకే రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఆ బృందం ఏపీలో పనిచేసినప్పుడు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదలాయింపు జరిగితే సరే. ప్రభుత్వం నుంచి మాత్రం బదలాయింపు జరిగి ఉంటే ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయం.

* ఆర్థిక లావాదేవీలు..
రుషిరాజ్ సింగ్( Rishi Raj Singh ) ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ అగ్రనేతలు ఆర్థిక ఒప్పందాలు చేసుకున్నట్లు ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు ఏపీ మూలాలను వెలికి తీసే పనిలో ఉంది ఈడి. ఒకవేళ విచారణలో రుషిరాజ్ సింగ్ నోరు తెరిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందికరమే. వారికి సైతం నోటీసులు ఇచ్చేందుకు ఈడి వెనుకడుగు వేయదు. వైసీపీకి ఐదేళ్లపాటు సేవలందించారు రుషిరాజ్ సింగ్. మొన్నటి ఎన్నికల ఫలితాలు రాకముందే కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆయన రూపంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు ప్రారంభమైనట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper