Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Industrial Development: పారిశ్రామిక ఆంధ్ర ప్రదేశ్.. రెండేళ్ల కూటమి పాలనలో ఎంత...

Andhra Pradesh Industrial Development: పారిశ్రామిక ఆంధ్ర ప్రదేశ్.. రెండేళ్ల కూటమి పాలనలో ఎంత మారిపోయిందంటే..

Andhra Pradesh Industrial Development: ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వనరులు ఉన్నాయి. మానవ వనరులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటిచోట పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టాలి. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలి. ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం సమకూరాలి. కానీ వైసిపి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో దీనికి విరుద్ధంగా జరిగింది. అందువల్లే ఏపీలో పారిశ్రామిక ప్రగతి పడక వేసింది. పైగా ఉన్న కంపెనీలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయి. కూటమి […]

Andhra Pradesh Industrial Development: ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వనరులు ఉన్నాయి. మానవ వనరులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటిచోట పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టాలి. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలి. ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం సమకూరాలి. కానీ వైసిపి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో దీనికి విరుద్ధంగా జరిగింది. అందువల్లే ఏపీలో పారిశ్రామిక ప్రగతి పడక వేసింది. పైగా ఉన్న కంపెనీలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయి.

కూటమి ప్రభుత్వ హయాంలో

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. కేవలం రెండు సంవత్సరాల కాలంలో ఏపీ రాష్ట్రంలో 800 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. కొన్ని కంపెనీలు పెట్టుబడులు మొదలుపెట్టాయి. వీటి ద్వారా ఏకంగా 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మన దేశానికి ఏడాది కాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం విశేషం.

లక్షలకోట్ల పెట్టుబడులు

అనకాపల్లి ప్రాంతంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. దీనిని 1.35 లక్షల కోట్లతో నిర్మిస్తున్నారు.. రామాయపట్నంలో 96, 862 కోట్లతో బీసీపీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికంగా పేరుపొందిన కాకినాడలో ఏఎం గ్రీన్ అనే సంస్థ సుమారు రెండు గిగా వాట్ సామర్ధ్యంతో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇది పూర్తయితే దేశంలోనే అతిపెద్దది.. ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదిగా నిలుస్తుంది. అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం కూడా పూర్తికావస్తోంది.. విశాఖలో గూగుల్.. రిలయన్స్ డేటా సెంటర్ల నిర్మాణం వేగంగా సాగిపోతూ ఉంది.

కీలక ఆదేశాలు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల గుండెల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇబ్బంది పెట్టేది. దీనిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇసుక విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఉచితంగా ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చెత్త పన్ను మొత్తం రద్దు చేసింది. అంతేకాదు, 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూటమి ప్రభుత్వం తొలగించింది. వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తగ్గించేసింది. తద్వారా వికాసం వైపు ఏపీ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తోంది. రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏపీ రాష్ట్రంలో గణనీయమైన మార్పును కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper