Viral Video : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గోనెగండ్ల అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మంత రాజు, ఆయన భార్య నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వివాహం జరిగింది. మిగతా వారికి వివాహం కాలేదు. ఇందులో ఇద్దరు కుమారులకు వయసు 40 సంవత్సరాలు దాటింది. వారికి వివాహం జరగకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు గేలి చేస్తున్నారు. సరైన వయసుకు పెళ్లిళ్లు కాకపోవడంతో ఆ ఇద్దరు కుమారులు బంధువుల ఇంటికి కూడా వెళ్లడం లేదు. గ్రామంలోనే చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే వారు తమకు పెళ్లిళ్లు కావడంలేదని.. దానికి కారణం తమ తండ్రి అని ఆరోపిస్తూ అతనిపై దాడికి దిగారు. ఒక గదిలో తండ్రిని బంధించి ఇష్టానుసారంగా కొట్టారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు అతని కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తం కూడా వస్తోంది. అతడు నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో ఈ విషయం బయటపడటంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. కొడుకులు కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక రాజు ఆర్తనాదాలు పెట్టడంతో.. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఇంట్లోకి వెళ్లి ఆ గది తలుపులు బద్దలు కొట్టి రాజును బయటికి తీసుకొచ్చారు. వారి కుమారులను వారించారు. ఈ దృశ్యాలను కొంతమంది ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఫలితంగా ఈ ఘటన వైరల్ గా మారింది.
కొడుకులు ఏమంటున్నారంటే..
రాజుకు మంత్రాలు వస్తాయట. అతడు చేతబడి చేస్తుంటాడట. ఆయన భార్యను నిత్యం కొడుతుంటాడట. కొడుకులు వారించినప్పటికీ ఆమెపై నిత్యం ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంటాడట. ఈ విధానం మార్చుకోమని కుమారులు అనేకసార్లు చెప్పారట. ఆయనప్పటికీ రాజు తన తీరు మార్చుకోలేదట. తీరు మార్చుకోకపోవడంతో తమకు పెళ్లిళ్లు కావడం లేదని ఆ కుమారులు చెబుతున్నారు. తమ తండ్రి మంత్రాలు చేస్తుండడం వల్లే ఇలా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు..” మా అమ్మతో పెళ్లి జరిగిన నాటి నుంచి ఇదే వరుస. ఆయన మంత్రాలు చేస్తారు. చేతబడి కార్యక్రమాలు చేపడుతుంటారు. అందువల్లే మాకు వివాహాలు జరగడం లేదు. దీంతో బయటికి వెళ్లాలంటే సిగ్గు అనిపిస్తోంది. 40 సంవత్సరాలు దాటినా వివాహాలు జరగకపోతే ఎలా ఉంటుందో మీరే చెప్పాలి.. మా అమ్మను నిత్యం కొడుతున్నాడు. ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉన్నాడు. ఇలా అయితే ఎలా.. చాలాసార్లు చెప్పి చూసాం. ఆయన మారలేదు. అందువల్లే ఓ గదిలో బంధించి కొట్టాల్సి వచ్చిందని” రాజు కుమారులు వాపోతున్నారు. అయితే స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. రాజును ఆసుపత్రికి తరలించారు. ఆ ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే రాజును కొడుతున్నప్పుడు అతని కుమార్తె కూడా సోదరులకు సపోర్టు చేయడం విశేషం. పైగా పోలీసులు వచ్చినప్పుడు తన తండ్రికి ఆమె వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం.
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. తమకు పెళ్లి చేయడం లేదని చెప్పి గోనెగండ్ల చెందిన మంత రాజు కుమారులు అతడిపై దాడి చేశారు. రాజుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వివాహం జరిగింది. కుమారులకు మాత్రం పెళ్లిళ్లు కాలేదు.#karnool pic.twitter.com/zinqXK14SH
— Anabothula Bhaskar (@AnabothulaB) November 22, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: His sons attacked their father mantha raju saying they were not getting married
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com