Ishan Kishan : టీమిండియా లో వర్ధమాన ఆటగాడిగా.. వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ సుపరిచితుడు. ఇతడు అద్భుతమైన ఆటగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడడం ఇతడికి అలవాటు. అందువల్ల ఇటీవల కాలంలో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. జట్టులో ఎంత పోటీ ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ ఇతడికి చోటు కల్పిస్తోంది అంటే.. ఇతడి ఆట ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కిషన్ మైదానంలో దూకుడుగా ఆడుతూ ఉంటాడు. ఈ స్టార్ వికెట్ కీపర్ పాట్నాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. మైదానంలో వీర విహారం చేసేటప్పుడు అకస్మాత్తుగా బ్యాంకు కార్యాలయంలో ప్రొఫెషనల్ ఐడి కార్డు వేసుకొని కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ సిబ్బందితో కలిసి కిషన్ ఫోటోలు దిగాడు.
కిషన్ కు 2017లో స్పోర్ట్స్ కోటలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం సాధించాడు. అయితే అతని వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. క్రికెట్లో అతడు అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలోనే ఉద్యోగం సాధించాడు. ఆర్బిఐ లో ఉద్యోగాన్ని చేయడం మాత్రమే కాకుండా డివై పాటిల్.. ఇంకా అనేక రకాల డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలలో కిషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఆడాడు. కాస్త విరామం దొరికితే చాలు అతడు పాట్నాలోని ఆర్బిఐ ఆఫీసుకు వెళ్తాడు. తన విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఇటీవల అతడికి ఖాళీ దొరకడంతో పాట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో విధులు నిర్వహించాడు. తోటి ఉద్యోగులతో కలిసి ఫోటోలు దిగాడు. మొదట్లో ఫోటో దిగడానికి ఆర్బిఐ ఉద్యోగులు పోటీపడ్డారు. కిషన్ కూడా ఎంతో ఓపికతో ఉద్యోగులు అందరితో కలిసి ఫోటోలు దిగాడు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ పదవి గ్రేట్ ఏ స్థాయిలో ఉంటుంది. ఈ ఉద్యోగానికి జీతం కూడా భారీగానే వస్తుంది. బేసిక్ పే దాదాపు 45 వేల నుంచి 49 వేల వరకు ఉంటుంది. అలవెన్స్లు.. ఇతర సౌకర్యాలు కలుపుకుంటే 90 నుంచి 1,15,000 వరకు గ్రాస్ శాలరీ వస్తుంది. కొన్ని రకాల మినహాయింపులు పోతే చేతికి దాదాపు 90 వేల వరకు వస్తుంది. ఈ ప్రకారం చూసుకుంటే కిషన్ కు దాదాపు 90000 వరకు వేతనంగా లభిస్తుంది.