Bigg Boss Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ షో మంచి ఊపు మీద ముందుకు దూసుకెళ్తోంది. అదే సమయం లో ఈ షో పై తీవ్రమైన విమర్శలు కూడా ఎదురు అవుతున్నాయి. ముఖ్యంగా జడ్జీల పట్ల ప్రేక్షకులు అసంతృప్తి తోనే ఉన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళు విఫలం అవుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉదాహరణకి నేటి ఎపిసోడ్ లో రోహిత్ దుమ్ము దులిపేసాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన చేసిన ఒకే ఒక్క పొరపాటు కారణంగా , జడ్జీలు అతనికి ఎల్లో కార్డు ఇచ్చారు. అంటే డేంజర్ జోన్ లో ఉన్నట్టు అన్నమాట. మరో ఎల్లో కార్డు ఇస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేటి ఎపిసోడ్ లో ముందుగా ఆర్మ్ రిజిలింగ్ టాస్క్ ని నిర్వహిస్తారు. ఈ టాస్క్ లో రోహిత్, మితిలేష్ రెడ్డి పాల్గొంటారు.
మితిలేష్ రెడ్డి మంచి ఫిట్నెస్ ఫ్రీక్, జిమ్ ట్రైనర్ , ఇతనికి చాలా బలం ఉంటుంది కాబట్టి , ఈయనే గెలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ రోహిత్ మితిలేష్ ని ఓడిస్తాడు. జడ్జీలు కూడా ఒక్కసారిగా షాక్ కి గురి అవుతారు. బిందు మాధవి మాట్లాడుతూ ‘రోహిత్ నిన్ను చాలా తక్కువ అంచనా వేశాము , నీలో పొటెన్షియల్ భారీగా ఉంది’ అని అంటుంది. ఇక ఆ తర్వాత మ్యూజికల్ చైర్స్ టాస్క్ లో కూడా అందరికంటే ముందుగా రోహిత్ గెలిచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ పేరు తెచ్చుకొని రెడ్ టీం లోకి వెళ్తాడు. ఆ తర్వాత కెప్టెన్ కూడా అవుతాడు. కెప్టెన్ అయ్యాక , రోప్ పుల్లింగ్ టాస్క్ కి మంచి స్ట్రాటజీలు ఇచ్చాడు. ఆయన స్ట్రాటజీలు వర్క్ అవ్వడం వల్ల , ఆ టీం కూడా గెలుస్తుంది.
కానీ రోప్ పుల్లింగ్ టాస్క్ లో రోహిత్ తన రెండు చేతులు ఉపయోగించాడని , అది పూర్తిగా రూల్స్ కి విరుద్ధమని, రూల్స్ పాటించడం ఎంత ముఖ్యమో చెప్పేందుకే రోహిత్ కి ఎల్లో కార్డు ఇస్తున్నామని , కానీ అతను టాస్కులు అద్భుతంగా ఆడాడని జడ్జీలు చెప్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , రెడ్ టీం కి కెప్టెన్ అయిన కారణంగా, రోహిత్ కి ఓటు అప్పీల్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. కానీ అది ఆయన శ్రేష్టి కి త్యాగం చేస్తాడు. అయినప్పటికీ కూడా చివరికి ఆయనకు ఎల్లో కార్డు దక్కింది. రూల్స్ దాదాపుగా చాలా మంది కంటెస్టెంట్స్ ఈ షో లో అనుసరించలేదు , అయినప్పటికీ అద్భుతంగా గేమ్స్ ఆడుతూ వస్తున్న రోహిత్ కి ఎల్లో కార్డు ఇచ్చి డేంజర్ జోన్ లోకి పంపడం అన్యాయం అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.