Ramayana Movie: నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. విడుదలకు ముందే 75 కోట్ల గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టిన ఈ చిత్రం కచ్చితంగా మొదటి రోజు 110 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంతా భావించారు. అయితే ఈ సినిమా అందరి అంచనాలను అధిగమించి 127 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఈ వీకెండ్ లో మొదటి రోజు కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చే రోజు కూడా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాం.
హిందీ వెర్షన్ నుండి ఈ చిత్రానికి నార్త్ ఇండియా నుండి 47 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా కర్ణాటక రాష్ట్రము నుండి 7 కోట్ల 25 లక్షలు , తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్లు , తమిళనాడు నుండి 2 కోట్ల 60 లక్షలు, మలయాళం నుండి 1 కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా 77 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక వరసీస్ లో అయితే దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 127 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కూడా చాలా స్ట్రాంగ్ గా నూన్ షోస్ మొదలు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 52 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది మొదటి రోజు కంటే ఎక్కువ అని చెప్పాలి. ఇక రేపు , ఎల్లుండి వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో మీరే ఊహించుకోండి.