Homeఆంధ్రప్రదేశ్‌Bandla Ganesh emotional speech on Chandrababu: సాయం కోరిన వ్యక్తికి చంద్రబాబు చేసిన పని...

Bandla Ganesh emotional speech on Chandrababu: సాయం కోరిన వ్యక్తికి చంద్రబాబు చేసిన పని అది.. బండ్ల గణేష్ ఎమోషనల్ స్పీచ్

Bandla Ganesh emotional speech on Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిడిపి అభిమానులు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు.. తెలంగాణ రాష్ట్రంలోనూ మెజారిటీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక పార్టీ కార్యకర్తల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు చంద్రబాబు జన్మదిన వేడుకల […]

Bandla Ganesh emotional speech on Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిడిపి అభిమానులు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు.. తెలంగాణ రాష్ట్రంలోనూ మెజారిటీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక పార్టీ కార్యకర్తల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా సే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదానం, వస్త్ర దానం, పేదలకు నగదు సహాయం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్లో విశేషంగా కార్యక్రమాలు జరుపుతున్నారు.. ఈ కార్యక్రమాలకు అతిరథ మహారధులు హాజరయ్యారు. వారంతా కూడా చంద్రబాబుతో తమకున్న అనుబంధాన్ని రకరకాలుగా చెప్పుకున్నారు. ఇందులో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయి. చంద్రబాబు గురించి బండ్ల గణేష్ అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

చంద్రబాబు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఏపీ ప్రభుత్వం పెట్టిన ఓ కేసులో అరెస్టు అయ్యారు. రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు కోసం సంఘీభావంగా చాలామంది బయటికి వచ్చారు. అందులో బండ్ల గణేష్ కూడా ఉన్నారు. నాటి ఏపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా ఆ కేసును పెట్టడంతో టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. జగన్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. అందులో బండ్ల గణేష్ కూడా ఉన్నారు. చివరికి న్యాయం గెలవడంతో చంద్రబాబు బయటికి వచ్చారు. ఆ తర్వాత ఏపీ రాష్ట్రాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కూడా తోడు కావడంతో ఏపీలో కూటమి జోరు చూపించింది. 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత గణేష్ పాదయాత్ర చేశారు. తిరుమలకు వెళ్లి తన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని చంద్రబాబు నాయుడుకు అందించారు. బండ్ల గణేష్ చంద్రబాబును కలవడానికి ముందు.. ఒక వ్యక్తి వచ్చారు. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఒక చీటీ చంద్రబాబుకు అందించారు. దానిని చూసిన చంద్రబాబు.. పక్కనే ఉన్న తన సిబ్బందికి రెండున్నర లక్షలు ఇవ్వాలని సూచించారు. ఆ వ్యక్తి చంద్రబాబును దాటుకుని నాలుగు అడుగులు వేశారో లేదో గాని.. వెంటనే తన సిబ్బందిని వెనక్కి పిలిచి ఐదు లక్షలు ఇవ్వాలని సూచించారు. అక్కడ చంద్రబాబు అంటున్న ఆ మాటలను చూసిన గణేష్ ఆశ్చర్యపోయారు. అదే విషయాన్ని బండ్ల గణేష్ చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రస్తావించారు.

“కార్యకర్తలు నాయకులు పట్టించుకోరు. అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలను దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. కానీ చంద్రబాబు అలా కాదు. ఆయనకు కార్యకర్తలు అంటే ప్రాణం. అందువల్లే వారి కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే స్పందిస్తారు. ఇతోధికంగా సహాయం చేస్తుంటారు. ఈ విషయాన్ని బయట చెప్పుకోరు. చెప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. చంద్రబాబు 78 వసంతాలు మాత్రమే కాదు.. ఇంకా అంతకంటే ఎక్కువ జన్మ దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని” బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper