Chandrababu Birthday: చంద్రబాబు 75 వ సంవత్సరంలో అడుగు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుప్పంలో నారా భువనేశ్వరి చంద్రబాబు జన్మదిన కేకును కట్ చేసి.. పార్టీ శ్రేణులతో వేడుకలు జరుపుకున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కీలక ఎన్నికల సమయంలో చిరంజీవి చేసిన ఈ ట్విట్ పొలిటికల్ సర్కిల్లో వైరల్ గా మారింది.
గతంలో చాలాసార్లు చంద్రబాబు జన్మదినం నాడు చిరంజీవి స్పందించారు. కానీ ఈ ఎన్నికల సీజన్ కావడం, జనసేనతో టిడిపి పొత్తులో ఉండడం తదితర కారణాలతో చిరంజీవి ట్విట్ కు ఎనలేని ప్రాధాన్యం దక్కింది.’ అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి ట్విట్ చేశారు.దీనిని టిడిపి శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. చిరంజీవికి కృతజ్ఞతలు చెబుతున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.’ రాజకీయంగా పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచిస్తారని.. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనప్పటికీ.. ఆయన దృఢమైన చిత్తం తో వాటిని ఎదుర్కొంటారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించినప్పుడు, జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయన మనోధైర్యం కోల్పోలేదు అని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి దూర దృష్టితో ఆలోచన చేసే నాయకుడు, తన పరిపాలన పటిమతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం దూర దృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు’ అంటూ పోస్ట్ చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో గడపాలని ఆకాంక్షించారు. మొత్తానికైతే చంద్రబాబుపుట్టినరోజు వేడుకల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.