Homeఆంధ్రప్రదేశ్‌Narendra Modi wishes Chandrababu: ప్రధాని మోదీ, పవన్, జగన్.. చంద్రబాబు బర్త్ డే ట్రెండింగ్

Narendra Modi wishes Chandrababu: ప్రధాని మోదీ, పవన్, జగన్.. చంద్రబాబు బర్త్ డే ట్రెండింగ్

Narendra Modi wishes Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో సైతం శుభాకాంక్షలు. ప్రస్తుతం సీఎం బర్త్డే విషెస్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టిడిపి, కూటమి పార్టీల శ్రేణులు. జన్మదినం సందర్భంగా సతీ సమేతంగా అన్న క్యాంటీన్లో అల్పాహారం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇంకోవైపు పెద్ద ఎత్తున విరాళం […]

Narendra Modi wishes Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో సైతం శుభాకాంక్షలు. ప్రస్తుతం సీఎం బర్త్డే విషెస్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టిడిపి, కూటమి పార్టీల శ్రేణులు. జన్మదినం సందర్భంగా సతీ సమేతంగా అన్న క్యాంటీన్లో అల్పాహారం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇంకోవైపు పెద్ద ఎత్తున విరాళం అందించారు నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు. భాష్యం అధినేత భాష్యం రామకృష్ణ టీటీడీలో ఒకరోజు అన్నదాన వితరణకు గాను 44 లక్షల రూపాయలు అందజేశారు. ఏపీవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన సోదరి షర్మిల చంద్రబాబుకు ప్రత్యేకంగా విషెస్ చెప్పడం విశేషం.

  • ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కష్టపడి పని చేసే సీఎం.. తన మంచి మిత్రుడు గా పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని.. ఆయన మరింత ఆరోగ్యంగా ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
  • ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్ సైతం సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని పేర్కొన్నారు.
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని.. అమరావతి, పోలవరం నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా స్వర్ణాంధ్ర కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళుతున్న సీఎం చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా, ఆనందంగా ప్రజా జీవితంలో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
  • మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని పేర్కొన్నారు.
  • పిసిసి చీఫ్ షర్మిల సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెప్పారు చంద్రబాబుకు. ఆయనకు దీర్ఘాయుష్ తో పాటు ఆరోగ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
  • చంద్రబాబు జన్మదినం సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కరోజు అన్నదాన వితరణకుగాను 44 లక్షల రూపాయలు అందించారు.
  • చంద్రబాబు జన్మదినం సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండింగ్ అంశం కూడా..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper