Delimitation Bill India Analysis: లోక్‌సభ సీట్లు పెంపు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రం లోక్‌సభలో ఇటీవల 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికోసం మూడు రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. కానీ, బిల్లును నెగ్గించుకోవడంలో ఎన్డీఏ విఫలమైంది. విపక్షాలన్నీ ఏకమై బల్లును ఓడించాయి. ఇందుకు విపక్షాలు చెప్పిన ప్రధాన కారణం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, బిల్లును సడెన్‌గా తెచ్చిందని, సీట్ల పెంపుతో భారం పడుతుందని. కానీ, బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు పెద్ద తప్పు చేశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు సహేతుకమైన కారణాలు వెల్లడిస్తున్నారు.
ప్రపోషనల్‌గా సీట్ల పెంపు..
ప్రస్తుత అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట 2011 జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలని భావించింది. అలా అయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు వ్యతిరేకించాయి. దీతో ప్రపోషనల్‌గా పెంచాలని కేంద్రం బిల్లు రూపొందించింది. దీంతో ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న ప్రాతినిధ్యంలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర మంత్రి అమిత్‌షా తెలిపారు.
విపక్షాలు, దక్షిణ నాయకుల ఆందోళనలు
అయితే విపక్షాలు బిల్లులో ‘ప్రపోర్షనల్’ పదం లేకపోవడాన్ని, భవిష్యత్ డీలిమిటేషన్‌తో (2026–27) సీట్లు తగ్గుతాయని వాదిస్తున్నాయి. సీట్లు పెంచితే ప్రజలకు భారం అవుతుందని పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్‌ను 543 సీట్లకే (179 మహిళలు) పరిమితం చేయాలని కోరుతున్నారు. అయితే, చంద్రబాబు నాయుడు వంటి నాయకులు ప్రపోషనల్ పెంపుకు మద్దతు పలికారు, దీన్ని ’విన్–విన్’గా పేర్కొన్నారు.
ప్రాతినిధ్య సమస్యలు..
140 కోట్ల జనాభాకు 543 సీట్లు తక్కువ (సగటు 25–30 లక్షలు/సీటు; మల్కాజిరి 30 లక్షలు). పెంపుతో ఇది మెరుగుపడుతుంది. ఇంగ్లండ్ లో 7 కోట్లు మందికి 650 సీట్లు ఉన్నాయి. దాంతో పోల్చితే, భారత్‌కు 850 సీట్లు అవసరం. ఖర్చు పెరుగుతుంది కానీ ప్రజాస్వామ్యం బలపడుతుంది.
మహిళా రిజర్వేషన్ లింక్
ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లుకు మహిళా రిజర్వేషన్‌కు పెంపును కేంద్రం లిక్ చేసింది. 543 సీట్లకు 179 (ప్రస్తుత 70+), 850కి 280+ మహిళలు పెరుగుతాయి. అయితే అందుకు పార్టీల సిద్ధత లేకపోవడం కూడా బిల్లు వీగిపోవడానికి కారణం.
విపక్షలు కోరుకున్నది జరగలే…
బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు కోరుకున్నది జరగకపోగా దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్‌లో నష్టం జరిగే అవకాశం ఉంది. చివరిసారి డీలిమిటేషన్ 2002లో జరిగింది. జనాభా ప్రాతిపదికన జరిగింది. తర్వాత 25 ఏళ్ల వరకు చేయవద్దని ఫ్రీజ్ చేసింది. 2026 వరకు మార్చే అవకాశం లేదు. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన చేయాలి. కానీ ఫ్రీజ్ చేసినట్లు నాటి ప్రభుత్వం తెలిపింది. 2026 నుంచి మళ్లీ డీలిమిటేషన్ చేయాలి. జనాభా ప్రాతిపదికన చేయాలి. 2021లో జనాభా లెక్కలు జరగాలి. కరోనా కారణంగా జరగలేదు. జనాభా లెక్కలు 2027లో పూర్తవుతాయి. దీంతో అప్పుడు రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ చేస్తారు. దీంతో జనాభా పెరగడంతో ఉత్తరాదికి సీట్లు పెరుగుతాయి. దక్షిణాది సీట్లు తగ్గుతాయి. దీంతో తాజా బిల్లును వ్యతిరేకించడం ద్వారా భవిష్యత్‌లో నష్టమే జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. దీనిని విపక్షాలు గుర్తించకపోవడంతో దక్షిణాదికి పరోక్షంగా నష్టం చేశాయి.
25 ఏళ్ల క్రితమే నిర్ణయం..
25 ఏళ్ల తర్వాత సీట్లు పెంచాలని వాజ్‌పేయి ప్రభుత్వం 2002లో రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు జరగాలి. అయితే జనాభా గణన చేయలేదనేది ఒక కారణం. జనగణన జరిగిన తర్వాత కచ్చితంగా డీలిమిటేషన్ చేస్తారు. దీంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దీని గురించి విపక్షాలు మాట్లాడడం లేదు. బిల్లును వ్యతిరేకించడం వలన బీజేపీకి విపక్షాలు మేలే చేశాయని నిపుణులు పేర్కొంటున్నారు. అమిత్‌షా చెప్పినట్లు 50 శాతం సీట్లు పెంచేందుకు విపక్షాలు అంగీకరించి ఉంటే రాజ్యాంగ సవరణ జరిగి ప్రపోషనరేట్‌గా సీట్లు పెరిగేవి. కానీ రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది.