Homeఆంధ్రప్రదేశ్‌Cattle Mineral Water Plant: పశువులకు సైతం మినరల్ వాటర్.. ఏకంగా రూ. 9 లక్షలతో...

Cattle Mineral Water Plant: పశువులకు సైతం మినరల్ వాటర్.. ఏకంగా రూ. 9 లక్షలతో ప్లాంట్!

Cattle Mineral Water Plant: సాధారణంగా పశువులు చెరువుల్లోనూ, కాలువల్లోనూ నీరు తాగుతుంటాయి. మేతకు వెళ్లే పశువులు దాహంతో అలా నీటిని తాగేస్తుంటాయి. ఈ క్రమంలో కాలుష్యనీరు తాగి అస్వస్థత బారిన పడుతుంటాయి. కానీ అనాదిగా అలానే వస్తుంది వాటి తాగునీటి వ్యవహారం. అయితే ఇప్పుడైతే నీటి తొట్టెలు వంటివి నిర్మిస్తున్నారు. వాటిలోనే పశువులకు తాగునీరు అందిస్తున్నారు. కానీ ఓ గ్రామంలో అయితే పశువుల కోసం ప్రత్యేకంగా మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం విశేషం. […]

Cattle Mineral Water Plant: సాధారణంగా పశువులు చెరువుల్లోనూ, కాలువల్లోనూ నీరు తాగుతుంటాయి. మేతకు వెళ్లే పశువులు దాహంతో అలా నీటిని తాగేస్తుంటాయి. ఈ క్రమంలో కాలుష్యనీరు తాగి అస్వస్థత బారిన పడుతుంటాయి. కానీ అనాదిగా అలానే వస్తుంది వాటి తాగునీటి వ్యవహారం. అయితే ఇప్పుడైతే నీటి తొట్టెలు వంటివి నిర్మిస్తున్నారు. వాటిలోనే పశువులకు తాగునీరు అందిస్తున్నారు. కానీ ఓ గ్రామంలో అయితే పశువుల కోసం ప్రత్యేకంగా మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం విశేషం. మీరు చదివింది నిజమే.. ఓ పశు క్షేత్రంలో ఇలా మినరల్ వాటర్ ప్లాంట్ ను అందించి సంరక్షిస్తున్నారు. మనుషులు మాదిరిగానే పశువులకు ప్రత్యేక వసతులు కల్పించడం ఆశ్చర్యం వేస్తోంది.

* ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా నాగులుప్పాలపాడు మండలం చదలవాడలో ఒక పశు క్షేత్రం ఉంది. అక్కడ వందలాదిమంది పశువులు ఉంటాయి. అందులో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒంగోలు జాతి ఆవులు, దూడలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్షేత్రం సమీపంలో కుంటలు, చెరువులు ఉన్నాయి. కానీ కలుషిత నీరు తాగి ఈ అరుదైన పశు జాతులు అనారోగ్యం పాడిన పడే అవకాశం ఉంది. అందుకే నిర్వాహకులు వినూత్న ఆలోచన చేశారు. తొమ్మిది లక్షల రూపాయలతో ఓ ఆర్ ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. సమీపంలోని చెరువు నుంచి నీటిని శుద్ధి చేసి పశువులకు అందిస్తున్నారు. ఈ క్షాత్రంలో దాదాపు 200 ఎకరాల్లో సాగుభూమి ఉంది. పాలన భవనాలు కూడా ఓ 9 వరకు ఉన్నాయి. పశువుల విశ్రాంతి తీసుకునేందుకు భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. సంరక్షణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

* ఆ కారణాల దృష్ట్యా..
పశు క్షేత్రాలు చాలా ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కానీ వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి పశువులను తెచ్చి ఇక్కడ సంరక్షిస్తుంటారు. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఆ పశువులు జీవించలేవు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురవుతున్నాయి. ఇక్కడి వాతావరణం పరిస్థితులకు తగ్గట్టు తట్టుకోలేకపోతున్నాయి. ప్రధానంగా తాగునీరు కలుషితం కావడంతో ఇవి అస్వస్థతకు గురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యుల సూచన మేరకు ఈ పశు క్షేత్రంలో రక్షిత మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా మనుషులకే లేదు కానీ.. ఇక్కడ జంతువులకు సైతం మినరల్ వాటర్ అందిస్తుండడం నిజంగా ఆకట్టుకుంటోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper