Homeఆంధ్రప్రదేశ్‌Veligonda Project: వెలిగొండ.. క్రెడిట్ మొత్తం ఆయనదే!

Veligonda Project: వెలిగొండ.. క్రెడిట్ మొత్తం ఆయనదే!

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశకు అంతా సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు విక్రమార్క ప్రయత్నంతోనే ఇది సహకారం అవుతుంది. ఫ్లోరైడ్ కోరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ వస్తోంది పశ్చిమ ప్రకాశం. అయితే ఆ నేలకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అందిస్తే సుభిక్షం అవుతుందని భావించారు చంద్రబాబు. అందుకు ఆయన మూడు దశాబ్దాల కిందట సంకల్పించారు. అది నేడు సాకారం అవుతుంది. 1996లో ఈ ప్రాజెక్టుకు సీఎం హోదాలో శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఇన్నాళ్లకు మళ్లీ […]

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశకు అంతా సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు విక్రమార్క ప్రయత్నంతోనే ఇది సహకారం అవుతుంది. ఫ్లోరైడ్ కోరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ వస్తోంది పశ్చిమ ప్రకాశం. అయితే ఆ నేలకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అందిస్తే సుభిక్షం అవుతుందని భావించారు చంద్రబాబు. అందుకు ఆయన మూడు దశాబ్దాల కిందట సంకల్పించారు. అది నేడు సాకారం అవుతుంది. 1996లో ఈ ప్రాజెక్టుకు సీఎం హోదాలో శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఇన్నాళ్లకు మళ్లీ తన చేతుల మీదుగానే తొలి దశను జాతికి అంకితం చేసే స్థాయికి తీసుకొచ్చారు. ఏపీ సాగునీటి రంగ చరిత్రలో ఇదో రికార్డ్. ప్రకాశం తో పాటు నెల్లూరు, కడప జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు.. సుమారు 23 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సంకల్పం నేడు వాస్తవ రూపం దాల్చింది.

* పరుగులు పెట్టించిన చంద్రబాబు..
వెలిగొండ ప్రాజెక్టు అంటేనే ముందుగా గుర్తొచ్చే పేరు సీఎం చంద్రబాబు. ఆ ప్రాజెక్టును ఒక్కసారి పరిశీలిస్తే చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలోనే ఈ ప్రాజెక్టు పనులు పరుగులు తీసాయి. నల్లమల అడవుల గుండా అత్యంత సంక్లిష్టమైన రెండు భారీ సొరంగాలను తవ్వి.. కృష్ణ జలాలను తరలించే ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని గత పాలకులు ఖర్చు దండ గాని పక్కన పెట్టేశారు. ఎన్నికలకు ముందు అరకొర పనులతో ప్రారంభోత్సవ డ్రామాలు ఆడారు. క్షేత్రస్థాయిలో నీటిని నింపే ప్రయత్నం మాత్రం చేయలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు నిధుల కొరతను అధిగమించగలిగారు. గత రెండేళ్ల కాలంలో రూ.2,250 కోట్లకు పైగా వెచ్చించి మొదటి దశ పనులను ఒక కొలిక్కి తెచ్చారు.

* నిర్వాసితులకు పూర్తి పరిహారం..
ఏ సాగునీటి ప్రాజెక్టు కైనా నిర్వాసితుల సమస్య ప్రధానమైనది. వారికి సరైన నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పిస్తేనే వారిలో సంతృప్తి. కానీ ఏ భారీ నీటిపారుదల ప్రాజెక్టులోనూ లేని విధంగా జలాశయంలోకి నీటిని విడుదల చేయడానికి ముందే.. ముంపు బాధితులకు పునరావాసం, పరిహారం కల్పించిన ఘనత మాత్రం సీఎం చంద్రబాబుకి దక్కుతుంది. గతంలో ప్రాజెక్టులు పూర్తయిన నిర్వాసితులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే దుస్థితి ఉండేది. కానీ వెలిగొండ విషయంలో ఆ పరిస్థితి రానివ్వకుండా, ప్రాజెక్టును ప్రారంభించే సమయానికి మూడో విడత కింద 250 కోట్ల పరిహారం విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 6206 ముంపు కుటుంబాలకు 768 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేసి.. దాదాపు 85% ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పారదర్శకంగా పూర్తిచేసి బాధిత నిర్వాసితులకు అండగా నిలిచారు సీఎం చంద్రబాబు. నల్లమల సాగర్ జలాశయం ద్వారా కరువు నేల సస్యశ్యామలం కాబోతుండడం మాత్రం గొప్ప పరిణామం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper