BTech Ravi: డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆందోళన కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఈ క్రమంలో జన సమీకరణకు నానా తంటాలు పడుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే కడప జిల్లాతో పాటు పులివెందుల ప్రాంతంలో ప్రైవేటు కాలేజీలకు చెందిన విద్యార్థులను ఆందోళనలకు తరలించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు పులివెందుల టిడిపి నేత బీటెక్ రవి. ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్థులను తరలించడానికి తప్పుపడుతూ నిరసనకు దిగారు. యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బీటెక్ రవి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* వైసిపి ప్రాబల్య ప్రాంతం..
సాధారణంగా పులివెందుల అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతం. అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఎంపీ అవినాష్ రెడ్డి అని వ్యవహారాలను చూస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థులను తరలించారు. ఈ విషయం బయటకు రావడంతో బిటెక్ రవి టిడిపి శ్రేణులతో కలిసి ఆ కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ తో చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు విద్యార్థులను ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి చాలా తప్పిదం అన్నారు. వైసిపి నిరసన కార్యక్రమాల్లో లాఠీ చార్జి జరిగిందని.. విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీనిపై క్షమాపణ చెప్పడంతో పాటు ఎవరు విద్యార్థులను తీసుకురమ్మన్నారు.. ఎవరు ఒత్తిడి చేశారు? అటువంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి. కాలేజీ ఫ్యాకల్టీ తో డీఎస్సీ 2025 కు అనుకూలంగా ర్యాలీ చేయండి అంటూ బీటెక్ రవి స్పష్టం చేశారు.
* వైఎస్ కుటుంబానికి తిరుగులేని చోట…
పులివెందుల లాంటి నియోజకవర్గం లో నాలుగు దశాబ్దాలుగా వైయస్సార్ కుటుంబానికి తిరుగులేదు. అయితే తొలిసారిగా బీటెక్ రవి లాంటి వారు గట్టిగానే ఎదురు తిరుగుతున్నారు. బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో పరిస్థితులు ఏకపక్షంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ముందుకు వెళుతున్నారు బీటెక్ రవి. నిన్న ప్రైవేట్ కాలేజీ వద్ద బీటెక్ రవి వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మున్ముందు పులివెందులలో పరిస్థితి ఎలా ఉండదు అని ఆయన గట్టి హెచ్చరికలే పంపినట్టు ఉన్నారు. గతంలో వైసిపి వై నాట్ కుప్పం అన్నట్టు మాట్లాడడం లేదు కానీ.. చాప కింద నీరులా టిడిపిని ముందుకు తీసుకెళ్లడంలో బీటెక్ రవి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.
View this post on Instagram