spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Arnab Goswami: మీరు హిందువులేనా.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?

Arnab Goswami: మీరు హిందువులేనా.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?

Arnab Goswami: మతపరమైన రాజకీయాలు చేయడం చాలా తప్పు. కానీ ఒక మత విశ్వాసాలపై, భక్తుల నమ్మకం పై ప్రమాదకరమైన కుట్ర జరుగుతున్నప్పుడు మాత్రం స్పందించాలి. అయితే తాజాగా కల్తీ నెయ్యిని వాడించి తిరుమల( Tirumala) ప్రతిష్టని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న వారి విషయంలో మాత్రం హిందూ మఠాధిపతులు, స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూమతం గొప్పదనాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రవచన కర్తలు నోరు మెదపకపోవడం ఒక విధంగా హిందూ మతానికి అన్యాయం చేసిన వారే. చివరకు విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సైతం ఆశించిన స్థాయిలో దీనిని ఎదుర్కొనే ప్రయత్నం చేయడం లేదు. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని నేషనల్ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

* ఆర్నాబ్ ప్రశ్నల వర్షం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో నెయ్యి కల్తీ జరిగింది అనేది వాస్తవం. దానిని ధ్రువీకరిస్తూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. తిరుమల చరిత్రను మసకబార్చే విధంగా వ్యవహరించిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొందరు హిందూ మేధావులు సమర్థిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. సున్నితమైన ఈ అంశంపై రిపబ్లిక్ టీవీ చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న హిందూ మేధావుల తీరును ఆర్నాబ్ గోస్వామి తప్పు పట్టారు. కొన్ని రకాల ప్రశ్నలు అడిగారు. కోట్లాదిమంది భక్తులు పరమ పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేయడానికి జగన్ ఎలా సమర్థించుకుంటారు? రకరకాల రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని తిరుమల ప్రసాదంలో వాడటం నిజం కాదా? నిజమైతే అది తప్పని ఒప్పుకోకుండా ఎందుకు వితండ వాదనలు చేస్తున్నారు? క్రిస్టియన్ మతానికి చెందిన జగన్ అతని అనుచరులు హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలలో ఎందుకు ఆటలాడుతున్నారు? అదే ఎవరైనా తన మత విషయాల్లో జోక్యం చేసుకుంటే సహిస్తారా? సమర్థిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్నాబ్.

* జాతీయస్థాయిలో చర్చ..
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా లడ్డు తయారీకి సంబంధించిన నెయ్యిలో కల్తీ జరిగింది. అసలు పాలతో తయారుచేసిన నెయ్యి కాదు అని తేలిపోయింది. తిరుమల పవిత్రతను ఇంతగా దెబ్బతీసిన జగన్ అండ్ శిబిరం కలిసికట్టుగా కూటమి ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తుంటే.. హిందూ మత రక్షక బాధ్యతలు తమవి అన్నట్టు చెప్పుకుని తిరిగే బిజెపి పెద్దలు, బజరంగ్ దళ్ వంటి సంస్థలు నోరు విప్పడం లేదు. దీనిపైనే ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా నోరు తెరవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...
Oktelugu Epaper